ఎగ్జిట్ పోల్స్ విడుదల నేడే .. అందరికీ టెన్షనే

ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది అని టెన్షన్ అందరిలోనూ నెలకొంది.

  ముఖ్యంగా వైసిపి( YCP ) ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగా , టిడిపి ,జనసేన ,బిజెపి లు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి.

భారీగా ఎన్నికల పోలింగ్ జరిగింది.  గతంలో కంటే అత్యధికంగా పోలింగ్ నమోదు కావడంతో పాటు,  మహిళలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దీంతో పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అనేది అందరికీ టెన్షన్ కలిగిస్తూనే ఉంది.ఎవరికివారు గెలుపు ధీమాతో ఉన్నారు.

ఖచ్చితంగా తామే గెలిచి అధికారం చేపడతామనే  ధీమాతో ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని కూడా టిడిపి అధినేత చంద్రబాబు పెట్టుకున్నారు.చంద్రబాబు నుంచి ప్రధాని నరేంద్ర మోది , అమిత్ షా( Prime Minister Narendra Modi , Amit Shah ) వరకు అంతా ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని తేల్చి చెబుతున్నారు.

Advertisement

ఇక ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ( Exit polls )విడుదల కానున్నాయి.ఆఖరి విడత ఫోలింగ్ ఉండడంతో ఈరోజు సాయంత్రం 6:00 తరువాత ఎగ్జిట్ పోల్స్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.దీనికి కోసమే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మే 13న పోలింగ్ జరిగితే దాదాపు 18 రోజుల పాటు ఫలితాలు తేలకపోయినా, అనధికారికంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని వాటిని ప్రచారం చేసేందుకు పెద్దపెద్ద సర్వే సంస్థలు సిద్ధం అయ్యాయి.  జాతీయ మీడియా సంస్థలతో పాటు, స్థానిక మీడియా అనే సర్వే సంస్థలు కూడా ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ను ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాయి.

అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒకే విధంగా ఉండవు.పోలింగ్ ఒకేరోజు జరగడంతో,  వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజల మూడ్ తెలుసుకుని వాటిని పరిగణలోకి తీసుకుని ఒక అంచనాకు మాత్రమే వస్తారు.

ఎగ్జిట్ పోల్స్ రిజల్స్ అన్ని ఒక విధంగా ఉండవు.అన్ని సర్వే సంస్థలు ప్రాథమిక అంచనాను మాత్రమే రిజల్ట్ గా విడుదల చేస్తాయి.జూన్ 4వ తేదీ వరకు అసలైన ఫలితాలు కోసం ఎదురు చూడాల్సిందే.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

అయితే ముందుగానే ఫలితం ఎలా ఉండబోతుందనేది ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలిసే అవకాశం ఉండడంతో, అందరూ వీటి కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు