బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆ దేశ ప్రజల కు క్షమాపణలు చెప్పారు.తను చేసింది తప్పే అని తన తప్పు ను అంగీకరించారు.
కారు లో ప్రయాణిస్తూ సీటు బెల్టు పెట్టుకోవడం మర్చిపోవడంతో ఆయనపై ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శించారు.ఈ విషయాన్ని ప్రధాని ప్రధాన కార్యదర్శి డివిస్ వెల్లడించారు.
ఒక ప్రచార కార్యక్రమం కోసం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ప్రధాని వెనుక కూర్చుని మాట్లాడారు.

ఈ సమయం లో ఆయన సీటు బెల్టు ధరించడం మర్చిపోయారు.దీని వల్ల నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయి విమర్శలు వెలువెత్తాయి.ప్రధాని అయి ఉండి రూల్స్ పాటించకపోవడం పై నెటిజన్లు మండిపడ్డారు.
అయితే దీని వల్ల రిషి తన తప్పు ఒప్పుకొని క్షమాపణలు కూడా చెప్పారు.ఇంకా చెప్పాలంటే గతంలో కరోనా సమయంలో కూడా రిషి నిబంధనలు అతిక్రమించారు.
పోలీసులు అందుకే జరిమానా కూడా విధించారు.

అప్పుడు కూడా ప్రజల ఆగ్రహానికి గురై విమర్శలను ఎదుర్కొన్నారు.ఇప్పుడు మరోసారి రిషి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు.దీన్నే అవకాశంగా తీసుకున్న ప్రతిపక్ష లేబర్ పార్టీ రిషి పై తీవ్ర స్థాయి లో విమర్శిస్తున్నారు.
గతంలో ఒక సారి ఆయన కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డును ఉపయోగించేందుకు ఇబ్బంది పడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.దేశ ప్రధానికి క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం కూడా రాదు అని ఎద్దేవా చేస్తున్నారు.
రైలు సేవలు, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా తెలియదు అని లేబర్ పార్టీ ఆయన్ను తీవ్రస్థాయిలో విమర్శిస్తుంది.







