ఊపందుకున్న రాష్ట్రపతి ఎన్నికల హడావుడి..

రాష్ట్రపతి ఎన్నికల హడావుడి ఊపందుకుంది.అధికార, ప్రతిపక్షాలు అభ్యర్థులను ప్రకటించాయి.

 Presidential Elections Gains Momentum After Nda And Opposition Parties Announced Candidates Details, Presidential Elections Gains , Nda ,opposition Parties , Presidential Candidates, Droupadhi Murmu, Yaswanth Sinha, Mamta Banerjee, Modi, Amit Sha, Naveen Patnaik-TeluguStop.com

ఇరువైపులా ఊహించని అభ్యర్థులు బరిలోకి దిగారు.సాధారణంగా అధికార కూటమి నిలపిన రాష్ట్రపతి అభ్యర్థి ఓడిన చరిత్ర ఇంతవరకు లేదు.

కాని పాలక ఎన్డీఏ కూటమికి మెజారిటీ లేదు.రెండు శాతం ఓట్లు తక్కువగానే ఉన్నాయి.

 Presidential Elections Gains Momentum After Nda And Opposition Parties Announced Candidates Details, Presidential Elections Gains , Nda ,opposition Parties , Presidential Candidates, Droupadhi Murmu, Yaswanth Sinha, Mamta Banerjee, Modi, Amit Sha, Naveen Patnaik-ఊపందుకున్న రాష్ట్రపతి ఎన్నికల హడావుడి..-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకంగా మారేది ఎవరు? భారత ప్రథమ పౌరురాలిగా తొలిసారి ఒక ఆదివాసీ మహిళా నేత ఎన్నిక కాబోతున్నారు.ఒడిషాలోని సంథాల్ తెగకు చెందిన ఆదివాసీ నేత ద్రౌపది ముర్మును కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమి తన అభ్యర్థిగా ప్రకటించింది.ఒక సాధారణ గిరిజన కుటుంబానికి చెందిన ద్రౌపది ముర్ము 1997లో ఒడిషాలో ఒక నగర పంచాయత్ కౌన్సిలర్ గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.2000 సంవత్సరంలో ఒడిషాలో బీజేపీ, బీజేపీడీ కూటమిలో మంత్రిగా పనిచేశారు.

2015లో జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు ద్రౌపది ముర్ము.ఇక ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన బిహార్ కు చెందిన యశ్వంత్ సిన్హా ఒరిజినల్ గా ఐఏఎస్ ఆఫీసర్.24 ఏళ్ళ సర్వీస్ తర్వాత వీఆర్ఎస్ తీసుకుని జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు.తర్వాత బీజేపీలో చేరారు.

రెండుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు.మూడేళ్ళ క్రితమే మమతా బెనర్జీకి చెందిన టీఎంసీలో చేరారు.

ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాలందరి ఆమోదంతో పోటీలోకి దిగారు.తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా యశ్ంత్ సిన్హాకే మద్ధతిస్తోంది.

ఇక తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి రెండు శాతం ఓట్లు తక్కువగా ఉన్న ఎన్డీఏ కూటమికి సాయం చేసేవారెవరు?

దేశంలో ప్రజల ద్వారా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ లేదు గనుక ఆ రాష్ట్రాన్ని మినహాయిస్తే దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్ల విలువ 10 లక్షల 86 వేల 431గా నిర్థారించారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక అభ్యర్థి విజయం సాధించాలంటే 5 లక్షల 43 వేల 216 ఓట్లు కావాలి.పాలక కూటమికి సుమారుగా 5 లక్షల 25 వేల 706 ఓట్లున్నాయి.

అంటే దాదాపుగా 20 వేల ఓట్లు తక్కువగా ఉన్నాయి.ఇప్పుడు వీటిని భర్తీ చేసుకోవడమే గాకుండా.

దేశ ప్రథమ పౌరురాలు గౌరవనీయమైన మెజారిటీతో గెలవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది ఎన్డీఏ కూటమి.

ద్రౌపది ముర్ము ఒడిషా నేత గనుక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కచ్చితంగా మద్దతిస్తారు.అభ్యర్థిని ప్రకటించే ముందు నవీన్ తో బీజేపీ నేతలు సంప్రదించి మద్దతు హామీ తీసుకున్నట్లు సమాచారం.ఇక ఏపీ అధికార పార్టీ వైసీపీ మద్దతు కూడా ఎన్డీఏకి కీలకంగా మారింది.

ఈ రెండు పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములు కాకపోయినా కాంగ్రెస్ కు కూడా దూరంగానే ఉంటున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube