హైదరాబాదులో ఆసక్తికరంగా మారిన పోస్టర్ల రాజకీయం!

ఎన్నికల తేదీ దగ్గరకొస్తున్న కొద్దీ ప్రజాభిమానం సంపాదించుకోవడంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ( Political parties )పోటీపడుతున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ తాము చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ తాము లేనిదే అభివృద్ది లేదు అని నినదీస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు పాలనలోని వైఫల్యాన్ని నిలదీస్తూ అంతకుమించిన అభివృద్ధి తాము వస్తే చేస్తామని మేనిఫెస్టోల ద్వారా ప్రజలకు వివరిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి .

అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్న రాజకీయ పక్షాలు ఇప్పుడు ఇతర పార్టీలను విమర్శించడానికి పోస్టర్ల యుద్ధానికి తెర తీసినట్లుగా కనిపిస్తుంది.గాంధీభవన్ చుట్టూ కాంగ్రెస్ పార్టీ( Congress party ) కి వ్యతిరేకంగా చాలా చోట్ల పోస్టర్లు వెలిసాయట.అందులో కాంగ్రెస్ ను స్కామ్ గ్రెస్స్ పేర్కొంటూ, కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు హామీలను విమర్శిస్తూ సేటైరికల్ గా పోస్టర్లు వేశారట.

ఇప్పటికే బిజేపి పార్టీ ( BJP party ) బి ఆర్ఎస్ పార్టీని( BRS party ) ఉద్దేశించి సాలు దొర సెలవు దొర అనే పేరుతో పోస్టర్లను వేశాయి.అదే విధంగా ప్రధానమంత్రి అమిత్ షా ,నరేంద్ర మోడీ ( Prime Minister Amit Shah, Narendra Modi ) ల తెలంగాణ పర్యటనలప్పుడు బారాస కూడా అదే అస్త్రాన్ని తిరిగి ప్రయోగించింది పది తలల రావణాసురుడుతో పోలుస్తూ మోడీ పోస్టర్లను పలుచోట్ల గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు.

దాని వెనక అధికార బారాస ఉందని ప్రచారం జరిగింది.

Advertisement

మరి ఇప్పుడు కాంగ్రెస్ ను విమర్శిస్తూ పెట్టిన పోస్టర్లు వెనక ఎవరు ఉన్నారన్నది స్పష్టంగా తెలియనప్పటికీ అధికార పార్టీ నే ఉన్నదంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.మరి తమపై వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారిని కాంగ్రెస్ నేతలు ఏ విధంగా ఎదుర్కొంటారో వేచి చూడాలి.చూస్తుంటే రానున్న రోజుల్లో ఈ పోస్టర్ల రగడ తెలంగాణ లో మరింత రాజుకునేలా కనిపిస్తుంది .

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు