ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును( SIB Ex DSP Praneeth Rao ) ఏడో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
డిసెంబర్ 4న రికార్డ్స్ ధ్వంసం అయిన సమయంలో జరిగిన పరిణామాలపై స్టేట్ మెంట్ రికార్డు చేశారు.అదేవిధంగా ఎస్ఐబీలో పని చేసిన అధికారులతో పాటు కానిస్టేబుళ్లను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ మేరకు స్పెషల్ టీమ్ ముందు విచారణకు అడిషనల్ ఎస్పీ తిరుపతన్న హాజరయ్యారు.కాగా విచారణకు హాజరు కావాలంటూ ఎస్ఐబీలో పని చేసిన తిరుపతన్నకు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే విచారణలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీలో పని చేసిన అందరిని అధికారులు విచారించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.అదేవిధంగా ప్రణీత్ రావును మేజిస్ట్రేట్ ఇంటిలో హాజరుపరిచే అవకాశం ఉంది.