ఏపీ పీ డి సి ఎల్ ఎ.ఇ ఆఫీస్ దగ్గర వీర నగర్ ప్రజలు సిపిఎం పార్టీ పెందుర్తి జోన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది
పెందుర్తి మండలం వీర నగర్లో 46 కుటుంబాలు గత పది సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు వారికి కనీసం విద్యుత్ సౌకర్యం కల్పించాలని అనేక దఫాలుగా ఏపీ ఈపీడీసీఎల్ అధికారులకు, జీవీఎంసీ అధికారులకు, కలెక్టర్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఎమ్మెల్యే ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చారు కానీ నేటికీ పది కుటుంబాలకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు మిగిలిన కుటుంబాలకు ఈరోజుకి విద్యుత్ సౌకర్యం లేదు.మహానగరంలో ప్రజలకు విద్యుత్ లేక పోవడం సరైంది కాదు.
ప్రభుత్వం అందరికీ విద్యుత్ అందిస్తాం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది కానీ మహానగరంలో లో వీర నగర్లో ప్రజలను చీకట్లో ఉంచడం సరైంది కాదు ఇది మానవ హక్కుల ఉల్లంఘనే.ఇప్పటికైనా జిల్లా అధికారులు అందరూ స్పందించి వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున పోట్లాడుతాం.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి జగన్ పెందుర్తి జోన్ నాయకులు అప్పలనాయుడు కాలనీ నాయకులు వై శ్రీను.పి సత్తిబాబు సింహాచలం కృపానందం నాయుడు జ్యోతి వెంకట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
.