ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది వారియర్.మొట్టమొదటిసారిగా రామ్ ఈ సినిమా ద్వారా ద్విభాషా చిత్రంలో నటించారు.
షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకుసంబంధించిన అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతుంది.
ఇకపోతే ఈ సినిమాలో గత కొన్ని రోజుల క్రితం విడుదలైన బుల్లెట్ సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే.
ఈ సినిమా కోసం కోసం ప్రముఖ హీరో శింబు పాడిన బుల్లెట్ పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సరికొత్త రికార్డులను సృష్టించింది.ఈ క్రమంలోనే యూట్యూబ్ లో బుల్లెట్ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌తో సరికొత్త రికార్డును సృష్టించింది.
ఈ విషయాన్ని డైరెక్టర్ లింగుస్వామి తెలియజేస్తూ ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు.ఈ క్రమంలోనే లింగస్వామి భారతీయ రాజాతో కలిసి ఈ పాటకు స్టెప్పులు వేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరింత హైలెట్ అయ్యింది.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్స్ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.ఈ సినిమాలో హీరో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
ఇక రామ్ తో పోటీ పడటానికి ఆది పినిశెట్టి విలన్ పాత్ర ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఇదివరకే ఈయన అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.







