చిలుకకు బాగా ఆకలేసింది.. పంజరంలో ఏం చేసిందో తెలిస్తే షాక్..

చిలుకలను( Parrots ) అందరూ ఇష్టపడతారు.వాటిని ఇంటిలో పెంచుకునేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

 The Parrot Is Very Hungry Shocked To Know What It Did In The Cage , Parrot , V-TeluguStop.com

అవి చూడటానికి చాలా ముద్దుగా అనిపిస్తాయి.అవి ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే.

అలాగే వింటూనే ఉండాలనిపిస్తుంది.చిలుకలు మనుషుల్లాగే మాట్లాడతాయి.

వాటికి సరైన శిక్షణ ఇస్తే ఏ భాషలోనైనా చాలా స్పష్టంగా మాట్లాడతాయి అనే విషయం మనందరికీ తెలిసిందే.చిలుకలు ముద్దుగా మాట్లాడుతున్న అనేక వీడియోలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారుతూ ఉంటాయి.

తాజాగా అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఆకలితో ఉన్న చిలుక అరవడం, ఆహారం కోసం గట్టి గట్టిగా కేకలు వేస్తుంది.

ఎవరో కెమెరాలో బంధించడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అక్టోబర్ 26న ట్విట్టర్ ( Twitter )లో @ChapraZila అనే హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది.

ఈ పోస్ట్‌కు ఇప్పటివరకు 1 లక్ష 92 వేల వేల వ్యూస్.ఒకటిన్నర వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

ఈ వీడియోలో చిలుక ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టమని అడగడం నేర్చుకుంది.ఈ మాటలు వినడానికి చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయి.

దీంతో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తన్నారు.

చిలుక వాయిస్ చాలా క్యూట్ గా ఉందని కొంతమంది అంటున్నారు.ఈ చిలుక మరాఠీలో బాగా మాట్లాడుతుందని మరికొంతమంది అంటున్నారు.

చిలుక మాటలు చాలా ముద్దుగా ఉంటాయి.చిన్న పిల్లల మాటల్లాగా ఉంటాయి.

అందుకే చిన్నపిల్లలు మాట్లాడే మాటలను చిలుకపలుకు అని పోలుస్తుంటారు.ఒకానొక సమయంలో చిలుక మాట్లాడుతోందా లేదా మనిషి మాట్లాడుతున్నాడా.

అని కూడా తికమకపడతారు.అంతగా మనిషిలాగే చిలుకలు మాట్లాడతాయి.

అటు చిలుక జ్యోతిష్యం కూడా బాగా పాపులర్.సరదాగా చాలామంది చెప్పిచ్చుకుంటూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube