ఆంధ్రప్రదేశ్ అధికార ప్రభుత్వం తీసుకొస్తున్న ఒక ప్రత్యేక చట్టం ఆ పార్టీ భయానికి సంకేతం అంటున్నాయి ప్రతిపక్షాలు.ముఖ్యంగా ముఖ్యమంత్రికి ఆయన భార్యా, పిల్లలు, తల్లికి దేశ విదేశాల్లో సైతం అత్యంత సమీప నుంచి భద్రత( ఫ్యాక్ట్స్మెంట్ సెక్యూరిటీ) కల్పించడానికి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్( Special Security Group ) ఏర్పాటు చేస్తూ ప్రత్యేక చట్టం చేశారు.
ప్రస్తుతం జగన్ కుమార్తెలు ఇద్దరూ( YS Jagan Mohan Reddy ) విదేశాల్లో ఉన్నారు వారికి అక్కడ కూడా భద్రత కల్పిస్తారు.

దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కీ లేని విధంగా ఏపీ సీఎం ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం ఇలా ప్రత్యేక ఎస్ ఎస్ సి ని ఏర్పాటు చేస్తున్నారు.అయితే మావోయిస్టుల ప్రమాదం ఉన్న ముఖ్యమంత్రలకి కూడా ఈ స్థాయి భద్రత లేదని కేవలం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నందునే ఆ భయంతో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి భద్రత ఏర్పాటుచేసుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.అనేక హింసాత్మక చర్యలు చేసి శత్రువుల సంఖ్యను పెంచుకునందువల్లే భయపడుతున్నారని ప్రధానమంత్రి కి తప్ప మరే ఇతర ముఖ్యమంత్రి కీ లేని భద్రతను కోరుకుంటున్నారు అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి .

ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ప్రత్యేక చట్టం గవర్నర్ ఆమోదం లభించి నోటిఫికేషన్ విడుదలయితే అమల్లోకి రానున్నట్లుగా తెలుస్తోంది ,ఒకసారి అమల్లోకి వస్తే ఇప్పటికే ఉన్న భద్రతకు ఇది అదనపు ఏర్పాటు అవుతుంది, అయితే ఎన్నికలకు దగ్గరలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి భద్రత ఏర్పాటు ముఖ్యమంత్రికి ప్రజల్ని మరింత దూరం చేసే అవకాశం ఉందని కూడా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.అయితే ఇటీవల ప్రతిపక్ష నేత అరెస్టు వంటి పరిణామాలతో పరిస్థితులు హాట్ హాట్ గా మారుతున్నందున భద్రత తప్పనిసరి అన్నది ఏలిన వారి ఆలోచనగా తెలుస్తుంది.ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ ( Andhra Pradesh )లో ఇంతకుముందు ఎప్పుడూ చూడని రాజకీయ వాతావరణం కనిపిస్తుంది.దానికి ఏ ఒక్క పార్టీని నిందించక పోయినా పరిస్థితులు దిగజారటం మాత్రం ప్రజాస్వామ్యంలో అభిలష నీయం కాదని మాత్రం చెప్పవచ్చు.







