ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.ఈ సినిమాతో మరోసారి తెలుగు రేంజ్ ను మార్చేశారు.
సుకుమార్, అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తిరుగులేని విజయం సాధించారు.తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కిన ఈ సినిమా మన దక్షణాది భాషల్లో కంటే కూడా ఉత్తరాదిన బాగా అలరించింది.
ఎలాంటి అంచనాలు కానీ ప్రొమోషన్స్ కానీ లేకుండా బాలీవుడ్ లో రిలీజ్ చేసారు.కానీ ఇది అక్కడ 100 కోట్లు వసూలు చేసి మన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంది.
ఈ సినిమా దాదాపు 400 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.సుకుమార్ కూడా తొందర పడకుండా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.
ఈ సినిమా పార్ట్ 2 స్టార్ట్ కాకుండానే అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరిపోయాయి.

ఈ సీక్వెల్ ను మరింత భారీ బడ్జెట్ తో నిమిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమా షూట్ నిన్న హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది.
గత కొన్నాళ్ల క్రితమే ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది.పుష్ప 2 గ్లిమ్ప్స్ ను ఇండియా వైడ్ అవతార్ 2 సినిమాతో అటాచ్ చేసి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ షూట్ దిల్ అవ్వడంతో పుష్ప ట్రీట్ కూడా మారిపోయింది.దీంతో అవతార్ 2 తో పుష్ప ట్రీట్ అనేది మిస్ అయ్యింది అని అంటున్నారు.ఇక మరో వాదన కూడా వస్తుంది.గతంలో మాదిరిగా కేవలం గ్లిమ్స్ షూట్ ముందే కంప్లీట్ చేసి రిలీజ్ చేయబోతున్నారా అనేది కూడా వేచి చూడాల్సిందే.మొత్తానికి అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదైనా ట్రీట్ ఉందా అనే దాని కోసం ఎదురు చూస్తున్నారు.







