దడ పుట్టిస్తున్న గూగుల్ పిక్సెల్ కొత్త ఫోన్లు... విడుదలకు ముందే సెన్సేషన్!

కొన్నాళ్ల క్రితం ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం Google సొంత స్మార్ట్ ఫోన్ పిక్సెల్ ని విడుదల చేసిన సంగతి తెలిసినదే.ఈ క్రమంలోనే తాజాగా మరిన్ని అప్డేట్లతో మరో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లును తీసుకు రావడానికి సర్వత్రా సిద్ధమైంది.

 The New Google Pixel Phones That Are Causing Palpitations Sensation Before The R-TeluguStop.com

అయితే ఈ కొత్త పిక్సెల్ డివైజ్ లాంచ్ చేయడానికి కాస్త సమయం పడుతుంది.కానీ ప్రస్తుతం ఈ ఫోన్లు టాక్ అఫ్ ది టౌన్ అవుతున్నాయి.

దానికి కారణం పిక్సెల్ ప్రొడక్టులకు సంబంధించిన కొన్ని కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడమే.

అవును, Google Pixel 7a, Google Pixel Fold ధరలు తాజాగా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

లాంచ్ టైమ్ కి ఇంకా నెలల వ్యవధి సమయం ఉండగానే స్పెసిఫికేషన్, డిజైన్ లీక్‌ అయినట్టు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.ఇదే మాదిరి కొన్ని రోజుల క్రితం iPhone 15 Ultra ధర కూడా లీక్ అయినట్టు వార్తలను మనం విన్నాం.

కాగా ఈ డివైజ్ 2023 చివరి నాటికి లాంచ్ కానుంది.ఇప్పటికే ఈ ఫోన్ కీలక అన్ని వివరాలు లీక్ అయ్యాయి.తాజాగా పిక్సెల్ 7a, పిక్సెల్ ఫోల్డ్ ధర లీక్ వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.అవేమిటో చూద్దాము.

Pixel 6a ఫోన్ మాదిరిగానే Pixel 7a ధర కూడా ఉండనుంది.అందులో పెద్దగా మార్పులు లేవు.పిక్సెల్ A సిరీస్ ఫోన్ ధర 449 డాలర్లుగా ఉంటుందని ఆండ్రాయిడ్ అథారిటీ నివేదించింది.అంటే మన భారత మార్కెట్లో దాదాపు రూ.37,185 ధర ఉండనుంది.ఇక పిక్సెల్ 7a ధర కాస్త ఎక్కువగానే ఉండొచ్చు.Pixel 6a భారత మార్కెట్లో రూ.43,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన సంగతి విదితమే.పిక్సెల్ ఫోల్డ్ విషయానికొస్తే.గూగుల్ నుంచి వచ్చిన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.పిక్సెల్ ఫోల్డ్ 1,799 డాలర్ల ధర ట్యాగ్‌తో వస్తుంది.భారత మార్కెట్లో దాదాపు రూ.1.49 లక్షలుగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube