ఆ యాక్షన్ సీన్ డూప్ అంటూ ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్.ఆఖరికి సూర్యను కూడా వదలట్లేరుగా?మామూలుగా సినిమాలలో యాక్షన్ సీన్స్ ఎంతలా వైలెన్స్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పెద్దపెద్ద సౌండ్లతో, కత్తులు, గన్స్ వంటి వాటితో ఓ రేంజ్ లో హైలెట్ చేస్తూ ఉంటారు.నిజానికి చూడ్డానికి ఆ యాక్షన్ సీన్స్ రియల్ గా అనిపించే విధంగా ఉంటాయి.
కానీ సెట్ లో చూస్తే అసలు రూపం ఏంటో బయటపడుతుంది.
కొన్ని సందర్భాలలో హీరోలు కూడా ఫైట్ సన్నివేశాలలో ఎత్తుకి ఎగురుతున్నట్లు.
పెద్ద పెద్ద బిల్డింగ్ ల పైకి ఎక్కినట్లు కనిపిస్తూ ఉంటారు.నిజానికి వాళ్లు అంత ఎత్తుకు ఎక్కలేరు.
ఒకవేళ ఎక్కాలన్న వారికి సపోర్టుగా కొన్ని అరేంజ్ చేస్తూ ఉంటారు.మామూలుగా కొంత మోతాదులో ఎత్తు ఉంటే మాత్రం కొందరి హీరోలు ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు.
కానీ మరికొంతమంది హీరోలు డూప్ లను పెట్టుకొని చేయిస్తూ ఉంటారు.చాలా వరకు చిన్న హీరోలు డూప్ లను పెట్టుకోరు.
అదే పెద్దపెద్ద హీరోలు మాత్రం ఖచ్చితంగా డూపులను పెట్టుకుంటారు.వారికి యాక్షన్ సీన్స్ లలో అంత ఎనర్జీ లేకపోవటంతో డూప్ లను ఫాలో అవుతుంటారు.
కానీ అలా డూప్ లను పెట్టుకోవడం వల్ల జనాలు బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.అంత పెద్ద హీరో అయ్యి ఉండి కూడా ఆ మాత్రం చేయలేరా అంటూ కామెంట్లు పెడుతూ ఉంటారు.
అయితే హీరో సూర్యను కూడా డూప్ అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు.ఇంతకూ అసలు విషయం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రముఖ తమిళ నటుడు సూర్య అంటే తెలియని వారు ఉండరు.తమిళ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సూర్య తెలుగులో( Surya ) కూడా స్టార్ పొజిషన్ కు చేరుకున్నాడు.
మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.
గజిని, సింగం వంటి పలు సినిమాలతో ప్రేక్షకులను ఫిదా చేశాడు.తన నటనకు ఎన్నో అవార్డులు అందుకున్నాడు.హీరో గానే కాకుండా ఆ మధ్య విలన్ గా కూడా నటించాడు.
ఇక ఈయన మరో హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.సూర్య సోషల్ మీడియా( Social media )లో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.
ఇదంతా పక్కన పెడితే ఈయనపై కొందరు నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇంతకు అసలు విషయం ఏంటంటే.సూర్య గతంలో సింగం (యముడు 2)( Singam ) సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా సీక్వెల్స్ లలో కూడా మంచి హిట్లు అందుకున్నాడు.
అయితే ఈ సినిమాలో షిప్ లో ఫైట్ సీన్ లో సూర్య చిన్న పడవ నుంచి పెద్దపడవ ఎక్కుతుంటాడు.పైగా అది చాలా ఎత్తులో ఉంటుంది.అయితే ఆ సీన్ లో ఎక్కింది సూర్య కాదు అని.డూప్ అని కొందరు బాగా ట్రోల్ చేస్తున్నారు.మామూలుగా సూర్య యాక్షన్ సన్నివేశాలలో బాగా పర్ఫామెన్స్ చేస్తూ ఉంటాడు.కానీ ఈ సీన్లో డూప్ లాగా కనిపించడంతో జనాలు బాగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.