ఈ విశాల ప్రపంచం అనేక వింతలూ విశేషాలకు నిలయం.ఒక్కోసారి ఆకాశంలో చిత్ర విచిత్రమైన ఆకారాలు జనులను కనువిందు చేస్తుంటాయి.
అలాంటివి మునుపెన్నడూ చూడలేదని మనవాళ్ళు గుసగుసలాడుకుంటూ వుంటారు.అలాగే మబ్బులన్నీ కలిసి వివిధ ఆకృతుల్ని సంతరించుకోవడం చూస్తుంటాం.
అదేవిధంగా భూమి మీద కూడా అనేక వింతలువిశేషాలు చోటు చేసుకోవడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.తాజాగా అలాంటి ఓ సంఘటనే జరగగా ఆ తంతు కాస్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విషయం ఏమంటే ఓ ఆవు ( cow )దూడకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆవు చర్మంపై వున్న స్మైలీ లోగో( Smiley logo ) ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది.కావాలంటే ఇక్కడ వున్న ఫోటోని గమనిస్తే మీకే అర్ధం అయిపోతుంది.ఎవరో పెయింట్‌తో డ్రాయింగ్ వేసినట్లుగా ఉన్న ఈ ఎమోజీని చూసి నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా జంతువుల చర్మంపై వివిధ రకాల ఆకారాలతో గుర్తులు ఉంటాయి.కానీ స్మైలీ ఎమోజీ ఉన్న జంతువులు చాలా అరుదుగా ఉంటాయి.

అయితే అలాంటి అరుదైన ఈ లేగదూడను చూడాలంటే మీరు ఆస్ట్రేలియాకి వెళ్లాల్సిందే.ఎందుకంటే అది అక్కడే వుంది మరి.హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ జాతికి చెందిన ఈ లేడ దూడ చర్మంపై ఉన్న స్మైలీ ఎమోజీ చూడటానికి చాలా అందంగా ఉండడంతో సదరు ఫోటోలు చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ జాతికి చెందిన దూడలు( Calves ) ఏడాదిలో సుమారు 700 వరకూ జన్మిస్తాయని, కానీ ఈ దూడ మాత్రం అన్నింటికీ భిన్నంగా ఉందని యజమాని మేగాన్ తెలిపారు.
తన దూడ శరీరంపై ఎమోజీని చూసి సంబరపడిపోయిన యజమాని.దాన్ని ఫొటో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వెలుగు చూసింది.







