ఓ తల్లి వ్యభిచారం చేయడమే కాక తన కూతురిని కూడా వ్యభిచార వృత్తి( Prostitution ) కొనసాగించాలని ఒత్తిడికి గురిచేసింది.అంతేకాదు ఆ అమ్మాయి శరీర భాగాలు పెరిగేలా ఇంజక్షన్లు, టాబ్లెట్లు వాడించడం మొదలుపెట్టింది.
ఇవన్నీ నచ్చని కూతురు ఏం చేసిందో చూద్దాం.వివరాల్లోకెళితే.
ఆ బాలిక తల్లి పెళ్లయిన కొన్నాళ్లకే భర్తకు విడాకులు ఇచ్చి, ఓ సబ్ ఇంజనీర్( sub engineer ) ను వివాహం చేసుకుంది.తర్వాత కొన్ని రోజులకు ఆ సబ్ ఇంజనీర్ కు విడాకులు ఇచ్చి వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది.
ఇక తన 15 ఏళ్ల కూతుర్ని కూడా ఇదే వ్యభిచార వృత్తిలోకి దింపాలని నిర్ణయించుకుంది.తరువాత సినీ రంగం వైపు పంపించాలని భావించింది.

ఇక ఆ అమ్మాయి శరీర భాగాలు విపరీతంగా పెరగడం కోసం ప్రతిరోజు ఇంజక్షన్లు, టాబ్లెట్లు ( Injections, tablets )ఇవ్వడం మొదలుపెట్టింది.అంతేకాదు తెలియని వ్యక్తులు ఇంటికి రావడం, తల్లి తన ముందే వ్యభిచారం చేయడం ఆ బాలికకు నచ్చేది కాదు.ఈ విషయంపై తల్లితో పలుమార్లు గొడవ పడింది.అప్పుడు ఆ తల్లి నువ్వు కూడా ఇంటికి వచ్చే వారితో చనువుగా ఉండాలని తీవ్ర ఒత్తిడికి గురిచేసింది.ఇక తల్లి చేష్టలను భరించలేకపోయిన ఆ బాలిక గురువారం రాత్రి చైల్డ్ లైన్ 1098 కు కాల్ చేసి రక్షణ కల్పించాలని కోరింది.చైల్డ్ లైన్ సభ్యులు, దిశ పోలీసులు ఆ బాలికను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించారు.

విచారణలో ఆ బాలిక నవోదయ పాఠశాలలో( Navodaya School ) చదువుతూ ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.పరీక్షల అనంతరం ఆ బాలిక విజయనగరంలో ఉంటున్న తన తల్లి దగ్గరకు వచ్చింది.తల్లి వ్యభిచారం చేయడమే కాక తనను కూడా వ్యభిచారం చేసే దిశగా ఒత్తిడి చేస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు ఆ బాలిక ఫిర్యాదు పై కేసు నమోదు చేసి ఆ బాలికను మొదట స్వధార్ హోం కు తరలించారు.
తర్వాత విశాఖలోని ప్రభుత్వ బాలికల పునరావాస కేంద్రంలో చేర్పించారు.విజయనగరం ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో బాలిక తల్లిని అదుపులోకి తీసుకొని చిల్డ్రన్స్ కోర్టులో విచారణ చేస్తున్నారు.