ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రాంతాలివే.. వెళ్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

మీరు విన్నది నిజమే.బేసిగ్గా ఇలాంటి విషయాలను మీరు సినిమాలలో చూసుంటారు.

 The Most Terrifying Places In The World, Dangors, Places, Viral Latest, News Vi-TeluguStop.com

కానీ ఈ భూమ్మీద నిజంగా అలాంటి ప్రాంతాలు వున్నాయి.ఇంకా వాటిమీద సినిమాలు కూడా హాలీవుడ్లో నిర్మించడం జరిగింది.

ఇలాంటివి ప్రపంచమొత్తం మీద చాలా ఉన్నప్పటికీ ఇక్కడ కొన్ని విషయాలను చూద్దాం.అమెరికాలోని లూసియానాలో, ‘ది మైర్ట్‌లెస్ సెయింట్ ఫ్రాన్సిస్‌విల్లే’ మోస్ట్ హాంటెడ్‌ ప్లేస్ గా పిలుస్తారు.

ఎందుకంటే ఇక్కడ 10 మందికి పైగా రకరకాల కారణాలతో మృతి చెందినట్లు సమాచారం.భవనం వరండాలో ఇద్దరు చిన్నారుల ఆత్మలు కన్పించాయని పలుమార్లు తెరపైకి వచ్చింది.

అలాగే సింగపూర్ లో బిషన్ MRT స్టేషన్.అనేది స్మశానవాటిక దగ్గరలో నిర్మించబడింది.ఈ స్టేషన్ 1987లో ప్రారంభించబడినప్పుటి దగ్గర నుంచి ఇక్కడ దెయ్యాల బెడద ఎక్కువైందని స్థానికులు చెబుతూ వుంటారు.కొందరు మహిళలు చేతుల్లేకుండా.

మరి కొందరు తలల్లేకుండా కన్పించారని అక్కడికి వచ్చే ప్రజలు చెబుతారు.ఇక రొమేనియాకు చెందిన లులియా హాస్‌డో హౌస్ కూడా హాంటెడ్‌గా పరిగణించబడుతుంది.

తన కుమార్తె మరణించిన తర్వాత.లులియా అనే అమ్మాయి తండ్రి ఆమె జ్ఞాపకార్థం ఈ భవనాన్ని నిర్మించాడు.

ఇక్కడ కూతురి ఆత్మతో కూడా మాట్లాడేవాడని అంటున్నారు.

Telugu Chateaude, Dangors, Latest, Lulia Hasdo, Myrtlessst-Latest News - Telugu

ఇక జపాన్‌లోని ఫుజి పర్వతం దిగువన ఉన్న ఓకిఘరాలో ఉన్న అడవి ప్రపంచంలోనే ఆత్మహత్యల అడవిగా ప్రసిద్ధి చెందింది.ప్రతి సంవత్సరం వందలాది మంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారట.ఫ్రాన్స్‌లోని చాటేయు డి చాటేబ్రియన్ ప్యాలెస్ లో అనుమానం రావడంతో ఓ మహిళకు ఆమె భర్త విషం ఇచ్చి హత్య చేసినట్లు సమాచారం.

స్త్రీ ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది.ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని బీచ్‌వర్త్‌లోని పిచ్చి ఆశ్రయం హాంటెడ్‌గా ఉంది.ఇక్కడ 1867 నుండి 1995 వరకు మానసిక ఆసుపత్రి ఉంది.130 ఏళ్ల ఈ పిచ్చాసుపత్రి చరిత్రలో 9000 మంది రోగులు ఇక్కడ చనిపోయారు.వారి ఆత్మలు ఇక్కడ ఉన్నాయని నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube