ప్రపంచంలోనే ఖరీదైన హోటల్ సూట్.. ఒక్క రాత్రి ఉంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

ప్రముఖ బాలీవుడ్ న‌టి అన‌న్యా పాండే గురించి మీకు తెలిసే వుంటుంది.ఆమధ్య లైగర్ సినిమాలోని మన రౌడీ దేవరకొండ సరసన హీరోయిన్ గా చేసింది.

 The Most Expensive Hotel Suite In The World Details, , The Most, Viral Latest ,-TeluguStop.com

విషయం ఏమిటంటే ఆమె క‌జిన్ అల‌న పాండే( Alanna Panday ) ఓ కంటెంట్ క్రియేట‌ర్‌.ఈ క్రమంలోనే ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన హోట‌ల్ సూట్ ఇదేనంటూ ఓ వీడియోను ఇన్స్టగ్రామ్ వేదికగా షేర్ చేయగా ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అవును, దుబాయ్‌లోని అట్లాంటిస్ ది రాయ‌ల్ హోటల్‌లో కొలువుదీరిన అద్భుత‌మైన రూం టూర్‌ను ఇన్‌స్టాగ్రాం రీల్‌లో ఆమె ప్ర‌దర్శించింది.ఈ ల‌గ్జ‌రీ ప్రాప‌ర్టీ రూమ్స్‌, పూల్ డెక్‌, ఆఫీస్‌, లైబ్ర‌రీ, కాన్ఫ‌రెన్స్ రూమ్‌ల‌ను ఈ వీడియోలో చూపించడం జరిగింది.

ఈ అల్ట్రా ల‌గ్జ‌రీ రిసార్ట్‌ లో మీకిస్టమైన వారితో ఓ రాత్రి మీరు గ‌డ‌పాలంటే రూ.83 ల‌క్ష‌లు చెల్లించాలట.ఈ విషయాన్ని ఆ అమ్మడే స్వయంగా చెప్పుకొచ్చింది.ఈ అల్ట్రా మోడ‌ర‌న్ టూ లెవెల్ ఫోర్ బెడ్‌రూం పెంట్‌హౌస్ ది రాయ‌ల్ మ్యాన్ష‌న్‌లో 12 సీట్ల డైనింగ్ రూం, స్విమ్మింగ్ పూల్‌, ఎంట‌ర్‌టైన్మెంట్ రూం, దుబాయ్ ఆకాశ‌హార్మ్యాల‌కు పోటీ ప‌డే ఎత్తులో ప్రైవేట్ టెర్రెస్‌లు మిమ్మల్ని అల‌రిస్తాయి.

అత్యంత ఖ‌రీదైన ఈ ల‌గ్జ‌రీ సూట్‌లో 4 బెడ్‌రూంలు, 4 బాత్‌రూంలు, స్టీమ్ రూమ్‌ల‌తో మొత్తం 4 బాత్‌రూంలు, అవుట్‌డోర్ కిచెన్స్‌, ఇండోర్‌, ఐమ్యాక్స్ థియేటర్ని తలపించే అదిరిపోయే మూవీ థియేట‌ర్‌, లైబ్ర‌రీ, ఆఫీస్‌, ప్రైవేట్ బార్ వంటి సౌక‌ర్యాల‌తో విలాస‌వంత‌మైన విడిదిని అందిస్తాయ‌ని వీడియోను షేర్ చేస్తూ పాండే ఇక్కడ రాసుకు రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు.చూసారా కదా ఆ వీడియో, కాస్త డబ్బులు ఎక్కువున్నవారు మీ వివాహ వేడుక తరువాత హనీమూన్ ప్లాన్ చేస్తే అక్కడికి వెళ్లొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube