టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిన ఆ మంత్రి పదవి!

దాదాపు పది సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో గాంధీభవన్ కళకళలాడుతుంది.

దశాబ్దం పాటు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు విజయోత్సవ సంబరాలను నాన్ స్టాప్ గా జరుపుకుంటున్నాయి.

ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి( Revanth Reddy ) పదవికి కూడా అన్ని అడ్డంకులు క్లియర్ అయిపోయి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.అయితే ఇప్పుడు చర్చంతా ప్రదానం గా మంత్రి మండలి పైనే నడుస్తుంది .అందులో ముఖ్యంగా బి ఆర్ఎస్ హయాంలో కీలకమైన నేతలు చక్రం తిప్పిన స్థానాలకు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరిని భర్తీ చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా ఐటి మినిస్టర్ గా కేసీఆర్ తనయుడు కేటీఆర్( KTR ) అద్భుతంగా పరిపాలించాడనే పేరు తెచ్చుకున్నాడు.ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సిన బారీ సంస్థ లను కూడా తన నైపుణ్యంతో తెలంగాణకు వచ్చేలా చేయడంలోనూ, ఐటీ ఆదాయాన్ని ఘణనీయ స్థాయిలో పెంచడంలోనూ, ఇన్ఫాస్ట్రక్చర్ సదుపాయాలు కల్పించడంలోనూ తనదైన మార్క్ వేసుకున్న కేటీఆర్, సమస్యల పరిష్కారంలో కూడా చొరవ చూపించడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కేటీఆర్ పనితీరుకు ఫిదా అయ్యారు.డైనమిక్ లీడర్ గా కొనియాడారు .

బిఆర్ఎస్ పార్టీ పరాజయం కంటే కూడా కేటీఆర్ ను తిరిగి మంత్రిగా చూడలేకపోతున్న బాధను చాలామంది ప్రముఖులు వ్యక్తం చేయడం గమనార్హం .ఇప్పుడు కేటీఆర్ పనితీరుని రిప్లేస్ చేసి ఆ పదవిని అలంకరించబోయే నేత ఎవరు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలనూ తీవ్రంగా చర్చ జరుగుతుంది.కేటీఆర్ ను మించి సామర్థ్యం చూపే నాయకుడిని ఎన్నుకోకపోతే మాత్రం కాంగ్రెస్ తేలిపోయే అవకాశం కనిపిస్తుంది.

Advertisement

అందులోనూ జిహెచ్ఎంసి పరిది లో కాంగ్రెస్ నుంచి కూడా ఎవరు గెలవక పోవడం కూడా మంత్రి వర్గ విస్తరణ లో ఆ పార్టీ కి ఇబ్బంది గా మారింది .కీలకమైన ఈ పదవి ఎవరికి దక్కబోతుందో మరో 24 గంటల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు