ప్రపంచంలో రోజూ ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి.ఇవి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.
కొన్ని ఆవిష్కరణలు చాలా వినూత్నంగా ఆకట్టుకునేలా ఉంటాయి.వీటిని చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
తాజాగా అలాంటిది ఒకటి ఆవిష్కృతం అయింది.లాస్ వెగాస్‌లోని( Las Vegas ) అతిపెద్ద టెక్ ఆవిష్కారం ఇప్పుడు అందరినీ మెస్మరైజ్ చేస్తుంది.
ఎంతోమందిని ఇది మంత్ర ముగ్ధులను చేస్తోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఈడీ గోళంను( Massive LED Sphere ) లాస్ వెగాస్ లో ఆవిష్కరించారు.ఎల్‌ఈడీ లైట్లతో మిలుమిట్లు గొలిపే కాంతులతో ఇది అందరినీ ఆవకర్షిస్తోంది.ప్రపంచంలోనే అతిపెద్ద రిజల్యూషన్ ర్యాప్ రౌండ్ ఎల్ఈడీ స్క్రీన్ గా ఇది పేరు తెచ్చుకుంటోంది.
ఎంఎస్‌జీ స్పియర్ అని పిలిచే అతిపెద్ద ఈ వీడియో స్క్రీన్ ఇప్పుడు పర్యాటకులను ఆకట్టుకోని సిన్ సిటీకే కొత్త అందాలను తెచ్చి పెడుతుంది.ఇది 366 అడుగుల పొడవు, 516 అడుగుల వెడల్పు ఉంటుంది.1.2 మిలియన్ ఎల్ఈడీ పుక్ లతో దీనిని తయారు చేశారు.ఇందులో 48 వ్యక్తిగత ఎల్‌ఈడీ డయోట్ లు ఉంటాయి.అలాగే 580,000 చదరపు అడుగులో ప్రొగ్రాం చేసిన ఎక్సోస్పియర్ గ్లోబబ్ ఉంటుంది.దాదాపు 256 మిలియన్ విభిన్న రంగులను ప్రదర్శించేలా ఈ ఎల్ఈడీ స్క్రీన్‌ను తయారుచేశారు.
గ్లోబర్ ఆర్కిటెక్చర్ సంస్థ ఎంఎస్‌జీ ( MSG ) ఈ అతిపెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్ ను తయారుచేసింది.దీని కోసం దాదాపు 2.3 బిలియన్ డార్లను ఖర్చు చేసింది.నెవెడాలోని లాస్ వెగాస్ లో జులై 4న దీనిని ప్రదర్శించారు.సెప్టెంబర్ 29న దీనిని అధికారికంగా లాంచ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.బాల్ ఆకారంలో దీనిని రూపొందించారు.దీనిని చూస్తే ఒక స్పేస్‌షిప్ లా రౌండ్ లా కనిపిస్తుంది.
ఇప్పుడు ఈ ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది.