Birds video : పక్షి పిల్లలతో ఆటలాడిన వ్యక్తి.. వాటి తల్లులు చేసిన పనికి పరుగులు పెట్టాడు..

ఎవరైనా ఎంత శక్తివంతమైన వారైనా, తన పిల్లలపై దాడి చేస్తే ఏ తల్లీ ఊరుకోదు.తన శక్తినంతా కూడగట్టుకుని అవతలి వారిపై దాడి చేస్తుంది.

 The Man Who Played With The Baby Birds ,birds , Bird Video , Viral News , Latest-TeluguStop.com

ఇది మనుషుల విషయంలో అయినా, జంతువులు-పక్షుల విషయంలోనైనా ఇదే వర్తిస్తుంది.తమ పిల్లలకు చిన్న ఆపద వస్తున్నా, ఏ తల్లి తట్టుకోలేదు.

తన పిల్లలను రక్షించడానికి ఏం చేయడానికైనా సిద్ధ పడుతుంది.ఒక తల్లి తన బిడ్డల గురించి ఎల్లప్పుడూ రక్షణగా ఉండడంలో ఆశ్చర్యం లేదు.

ఎందుకంటే పిల్లలను కనడం, పెంచడం, సంరక్షించడం ఏ తల్లి అయినా చాలా ప్రేమగా, బాధ్యతగా చేస్తుంది.దీనిని నిరూపించేలా ఓ పక్షి ప్రవర్తించిన తీరు ప్రస్తుతం వైరల్ అవుతోంది.

తన పిల్లలను రక్షించుకునేందుకు ఆ పక్షి చేసిన పనిని పలువురు నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.

ఏ తల్లి అయినా తన బిడ్డలకు ఏదైనా గండం ఉంటే వెంటనే అప్రమత్తం అవుతుంది.

దాని నుంచి వారిని రక్షించేందుకు ఎంతకైనా పోరాడుతుంది.తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న ఆహార పదార్థాలను కొన్ని పక్షి పిల్లలు (బాతు పిల్లలు)కు పెట్టేందుకు వెళతాడు.

వాటికి ఏదో పెట్టడానికి ప్రయత్నిస్తుంటే వాటి తల్లి పక్షి ఆ దృశ్యం చూస్తుంది.వెంటనే రియాక్ట్ అవుతుంది.

వెంటనే ఆ వ్యక్తి వెంట పడుతుంది.పరుగులు పెట్టించి, తరుముతుంది.

తన ముక్కుతో పొడిచేందుకు ప్రయత్నం చేస్తుంది.పక్షి తనపై దాడి చేయడం ఆపే వరకు అతను కొద్దిసేపు పారిపోవలసి వచ్చింది.

మొత్తం ఎపిసోడ్‌ని రికార్డ్ చేస్తున్న మహిళ అతని నిస్సహాయ పరిస్థితిని చూసి బిగ్గరగా నవ్వుకోలేకపోయింది.‘యు ఓల్డ్ గై’ అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది.దీనిని చూసిన నెటిజన్లు కూడా నవ్వు ఆపుకోలేక పోయారు.పక్షులైనా తమ పిల్లల జోలికి ఎవరైనా వస్తే ఊరుకోవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube