ఆవును కొట్టిన వ్యక్తి.. అతడిని ఎగిరి తన్నిన లేగదూడ.. వీడియో వైరల్..!

జనాలు పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు కానీ పశువుల విషయంలో మాత్రం కొందరు చాలా కఠినంగా వ్యవహరిస్తారు.వాటిని కర్రతో ఇష్టమొచ్చినట్లు కొడుతూ బాధిస్తారు.

 The Man Who Beat The Cow The Calf That Kicked Him , Cow , Viral Latest , News Viral , Social Media , Video Viral , Man Beat The Cow,cow Calf-TeluguStop.com

అవి మూగజీవుల అని, వాటికి ఏమీ తెలియదని, వాటిని మనమే రక్షించాలనే సోయి వీరిలో ఉండనే ఉండదు.వాటి మీదే ఆధార పడుతూ వాటిని ఇష్టానుసారం కొడుతూ తమ క్రూరమైన మనసుని చాటుకుంటుంటారు.

అయితే ఇటీవల ఒక వ్యక్తి కూడా ఒక ఆవును కర్రతో కొడుతూ రెచ్చిపోయాడు.అయితే దాని పక్కనే ఉన్న ఒక లేగదూడ ఈ దృశ్యాలను చూసి తట్టుకోలేక పోయింది.

 The Man Who Beat The Cow The Calf That Kicked Him , Cow , Viral Latest , News Viral , Social Media , Video Viral , Man Beat The Cow,cow Calf-ఆవును కొట్టిన వ్యక్తి.. అతడిని ఎగిరి తన్నిన లేగదూడ.. వీడియో వైరల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనంతరం అది గాల్లోకి ఎగిరి ఆ వ్యక్తిని గట్టిగా తన్నింది.దాంతో అతడు కింద పడ్డాడు.

అతడి షర్ట్‌కి మొత్తం ఆవుపేడ అంటుకుంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఆవుల షెడ్డులో చాలా ఆవులు ఉండటం గమనించవచ్చు.

అయితే ఈ షెడ్ కూడా అంత పరిశుభ్రంగా ఏమీ లేదు.చాలా ఆవులు కిక్కిరిసి ఒకే దగ్గర ఉన్నాయి.

అయితే ఒక వ్యక్తి ఈ ఆవులను ఒక కర్రతో కొడుతూ వాటిని మరింత ఇబ్బంది పెట్టాడు.ఇంతలోనే ఒక ఆవు దూడ పరిగెత్తుకుంటూ వచ్చి తన తల్లి ఆవుని కొడుతున్న వ్యక్తిపైకి ఎగిరి గుండెల మీద తన్నింది.

ఆ దెబ్బకు అతడు గాల్లో ఎగిరి మరీ కిందపడిపోయాడు.అక్కడే పేడ ఉండటంతో అతని చొక్కా మొత్తం పేడ మయమయ్యింది.

ఈ ట్విస్ట్ ఊహించని అతడు చాలా సేపు షాక్ లోనే ఉన్నాడు.ఆ తర్వాత తనకి ఏం జరిగిందో అర్థం చేసుకొని మరింత షాక్ అయ్యాడు.ఫిజెన్‌ అనే ఓ ట్విట్టర్‌ యూజర్‌ ఈ వీడియోను పంచుకుంది.దీనికి ఇప్పటివరకు దాదాపు 37 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.ఈ వీడియోని చూసి నెటిజనులు.“తిక్క కుదిరింది.మంచి పని అయింది.ఇలాంటివారికి ఇలాగే జరగాలి, బాగా అయింది” అని కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube