జగిత్యాల జిల్లా బలవంతపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.మాల్యాల ఎస్సై చిరంజీవి వేధిస్తున్నారని ఆరోపిస్తూ నక్కా అనిల్ అనే వ్యక్తి బలవన్మరణానికి యత్నించాడు.
పురుగుల మందు డబ్బాతో సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు.ఎస్సై చిరంజీవి తనపై అక్రమంగా రౌడీ షీట్ ఓపెన్ చేశాడని ఆరోపించారు.
అదేవిధంగా తనపై పీడీ యాక్ట్ కూడా పెడతానని బెదిరించాడని వీడియోలో పేర్కొన్నాడు.ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాపోయాడు.
దీనిపై తెలంగాణ డీజీపీ యాక్షన్ తీసుకోవాలంటూ వీడియోలో తెలిపాడు.కాగా ప్రస్తుతం అనిల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.