తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ కేంద్ర అధికార పార్టీ బిజెపి ( BJP party )వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ఒకవైపు బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఎత్తుగడలను నిశితంగా పరిశీలిస్తూనే , దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది.
ఇటీవల కాలంలో చేరికల జోష్ లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నేలకొనడంతో, చేరికల పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది.ఇక బీఆర్ఎస్( BRS party ) కాంగ్రెస్ లు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతుండడంతో , బిజెపి కూడా దానికి అనుగుణంగానే ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.

వచ్చే ఎన్నికల్లో గెలుపు బిజెపికి అత్యంత ప్రతిష్టాత్మక కావడంతో, తెలంగాణ పై బీజేపీ అగ్ర నేతలు దృష్టి సారించారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరుచుగా తెలంగాణలో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.అభ్యర్థుల జాబితాను ముందుగా ప్రకటించడం ద్వారా, మెరుగైన ఫలితాలు వస్తాయని నమ్ముతున్న బిజెపి అధిష్టానం ఈ మేరకు అభ్యర్థుల ఎంపికపైనే పూర్తిగా కసరత్తు మొదలుపెట్టింది.ఈనెల లోనే 25 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించేందుకు బిజెపి సిద్దమవుతోంది .మొదటి జాబితాలో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే బీజేపీలోని సీనియర్ నాయకులు అందరిని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది .దీనికి అనుగుణంగానే 25 మందితో కూడిన మొదటి జాబితాను విడుదల చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచాలని నిర్ణయించుకుంది.త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.
అందులో మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో ఇప్పటికే మొదటి విడత జాబితాను బిజెపి విడుదల చేసింది.అదేవిధంగా తెలంగాణలోనూ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
ఈనెల 27వ తేదీన తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) రానున్నారు .ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.ఖమ్మం పర్యటనలో భద్రాద్రి సీతారాములను అమిత్ షా దర్శించుకుంటారు. ఇక అక్కడి నుంచే తెలంగాణలో ఎన్నికల సమర శంఖాన్ని పూరించాలని నిర్ణయించుకున్నారు.అదే రోజున అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బిజెపి సిద్దమవుతుండడంతో ఆశావాహుల్లో మరింత టెన్షన్ నెలకొంది.
.