బీజేపీ అభ్యర్థుల జాబితా ఇప్పట్లో లేనట్టే .. ? 

తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో, అన్ని ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి.

ఇప్పటికే బీఆర్ఎస్ తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.దీంతో కాంగ్రెస్ బిజెపి( BJP party )లో కూడా తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.

కాంగ్రెస్ వచ్చే నెల మొదటి వారంలో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుండగా, బిజెపి కూడా వచ్చే నెల మొదటి వారంలోని అభ్యర్థులను ప్రకటించాలని ముందుగా నిర్ణయించుకుంది.

ఇప్పటికే పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసినట్లు సమాచారం.కానీ అకస్మాత్తుగా ఈ ప్రకటన విషయంలో బిజెపి వెనుకడుగు వేస్తోంది.ఇప్పటికే పార్టీకి చెందిన ముఖ్య నేతలు అంతా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండాల్సి ఉంటుందని జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులకు సంకేతాలు ఇచ్చారు.

Advertisement

దాదాపుగా 30 మంది వరకు కీలక నాయకులు పోటీకి సిద్ధమవుతున్నారు.అయితే వీరి అభ్యర్థిత్వలను ముందుగానే ప్రకటిస్తే వారంతా తమ నియోజకవర్గాలకే పరిమితమై ఇతర ప్రాంతాల్లో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని, తమ నియోజకవర్గాన్ని వదిలి వేరే చోట జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపించరనే ఉద్దేశంతో అభ్యర్థుల ప్రకటన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున ముందుగానే అభ్యర్థుల ప్రకటనతో భారీగా వ్యయం పెరుగుతుందని , ఇటువంటి సమస్యలు తప్ప పెద్దగా సానుకూలత ఉండే అవకాశం లేదని బిజెపి అగ్ర నేతలు భావిస్తున్నారు.ఇటీవల ఖమ్మం( Khammam )లో జరిగిన బిజెపి బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా( Amith shah ) కూడా అభ్యర్థుల ప్రకటన విషయంలో తొందర పడాల్సిన అవసరం లేదని, పార్టీ కార్యక్రమాలు నిర్వహణపైనే పూర్తిగా దృష్టి సారించాలని సూచించారు .సరైన సమయంలోనే అభ్యర్థులను ప్రకటించే విధంగా బిజెపి కసరత్తు చేస్తుంది.రాష్ట్రంలో 19 ఎస్సీ, 12 ఎస్టి రిజర్వుడు స్థానాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను గుర్తించి వారిని పోటీకి దింపడం ద్వారా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.ఒక్కో నియోజకవర్గంలో నుంచి ప్రజా బలమున్న ఇద్దరు నేతలను గుర్తించి వారిలో ఒకరిని ఫైనల్ చేయాలని నిర్ణయించుకున్నారు.

మొత్తంగా బీఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన విషయంలో దూకుడుగా ఉన్నా, తాము ఆచితూచి వ్యవహరించాలనే వ్యూహంతో బిజెపి నాయకత్వం ఉంది.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు