శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం ఎర్రవంకపల్లి సచివాలయ సిబ్బందిపై అధికార పార్టీ నాయకుడు వీరంగం.సచివాలయంలోనే ఇంజనీరింగ్ అసిస్టెంట్ పై దాడి.
శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం ఎర్ర వంక పల్లి సచివాలయంలో అధికార పార్టీ నాయకుడు వెంకటేష్ నాయక్ వీరంగం సృష్టించాడు.తనకు అనుకూలంగా పనులు చేయడం లేదని ఇంజనీరింగ్ అసిస్టెంట్ మురళినీ మహిళా ఉద్యోగుల ముందే పచ్చి బూతులు తిట్టాడు.
నీ అంతు చూస్తానంటూ సచివాలయంలోనే కింద పడేసి చెప్పుల కాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశాడు.అధికార పార్టీ నాయకుడు ఇలా హద్దు మీరి భౌతిక దాడికి దిగడంతో సచివాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
ఇదే విషయమై సదరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కు నల్లమాడ ఎంపీటీసీనీ అంటూ వెంకటేష్ నాయక్ స్నేహితుడు షబ్బీర్ ఫోన్ చేసి బండ బూతులు తిట్టాడు.నిన్ను ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపించకపోతే నేను ఎంపీటీసీనే కాదంటూ రెచ్చిపోయాడు.
సీఎం జగన్ మానస పుత్రికగా చెప్పుకునే సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పై అధికారి పార్టీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యాలకు ఆడియో వీడియోలు బయటకు రావడంతో ఈ అంశం పై జిల్లా వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.బాధితుడు మురళి పోలీసులను ఆశ్రయించడంతో అధికార పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని రాజీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.