వాట్సప్ లో సరికొత్తగా వాట్సాప్ ఛానల్స్ ఫీచర్.. ఇది ఎలా పనిచేస్తుందంటే..?

వాట్సప్( Whatsapp ) తన వినియోగదారుల కోసం సరికొత్తగా వాట్సాప్ ఛానల్స్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.ఈ ఫీచర్ తో యూజర్లు తమ కంటెంట్ ను ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు, పోల్స్ లేదా టెక్స్ట్ రూపంలో పంపించవచ్చు.

 The Latest Whatsapp Channels Feature In Whatsapp How Does It Work , Whatsapp, Wh-TeluguStop.com

వాట్సప్ యూజర్లు తమ ప్రాధాన్యతల ప్రకారం చానల్స్ కోసం సర్చ్ చేయవచ్చు.ఉదాహరణకు ఇష్టమైన క్రీడల బృందాలు, హాబీలు, స్థానిక అధికారుల నుంచి అప్డేట్ లు లాంటివి అన్నమాట.

అంతేకాకుండా చాట్ లు, ఇ-మెయిల్ లేదా ఆన్లైన్ లో పోస్ట్ చేసిన ఇన్విటేషన్ లింకుల నుంచి కూడా వినియోగదారులు ఛానల్ పొందవచ్చు.

ఈ వాట్సప్ చానల్స్ ఫీచర్ తో చక్కగా ప్రైవసీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

కానీ అదే ఛానల్ సభ్యత్వం పొందిన గుర్తు తెలియని యూజర్ల నుంచి ఫోన్ నెంబర్ ను యాక్సెస్ చేసే అవకాశం ఉంది.ఇక నిర్వాహకులకు, ఫాలోవర్లకు మధ్య ఉండే వ్యక్తిగత సమాచారాన్ని ప్రొటెక్ట్ చేసేందుకు వీలుంటుంది.

ఇంకా ఛానల్ ని ఫాలో అయ్యే వారికి మీ ఫోన్ నెంబర్ కనిపించదు.ఇక అడ్మిన్ ను ఫాలో అవ్వాలా లేదంటే ఫాలోవర్లను ఫాలో అవ్వాలా అనేది కేవలం యూజర్ల ఇష్టం.

Telugu Latest Telugu-Technology Telugu

ఇక వాట్సాప్ ఛానల్ హిస్టరీ 30 రోజుల వరకు మాత్రమే స్టోర్ చేయబడి ఉంటుంది.ఆ తర్వాత ఫాలోవర్ల డివైజ్ల( Followers devices ) నుండి ఛానల్ హిస్టరీ అప్డేట్ అదృశ్యమైపోతుంది.అడ్మిన్లు తమ చానల్ ని ఎవరు ఫాలో అవ్వాలో.ఎవరు ఫాలో కాకూడదో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.అంతేకాదు తమ ఛానల్ ని డైరెక్టరీ లో కనిపించాలా లేదా అనే కంట్రోలింగ్ ని కూడా అడ్మిన్లు కలిగి ఉంటారు.

Telugu Latest Telugu-Technology Telugu

ముందుగా ఈ వాట్సాప్ ఛానల్ కొలంబియా, సింగపూర్( Columbia, Singapore ) లలో అందుబాటులోకి రానుంది.ఆ తర్వాత మరిన్ని దేశాలలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.డైరెక్టరీ ద్వారా తమకు ఇష్టమైన ఛానల్ కోసం సర్చ్ చేయవచ్చు, సాధారణ అప్డేట్స్ పొందడానికి ఈ ఫీచర్ ఫాలో కావచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube