యూట్యూబ్ లో సరికొత్తగా పవర్డ్ డబ్బింగ్ టూల్.. ఇకపై డబ్ చేయడం అత్యంత సులభం..!

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ గా యూట్యూబ్( Youtube ) కు ప్రత్యేక గుర్తింపు ఉంది.యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేసేవారికోసం.

 The Latest Powered Dubbing Tool On Youtube Now Dubbing Is Very Easy, Youtube, Po-TeluguStop.com

వీడియోలు వీక్షించే వారి కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.ప్రస్తుతం తాజాగా యూట్యూబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డబ్బింగ్ టూల్( powered dubbing tool ) తీసుకువస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది.

Telugu Aloud, Google Aloud, Google Area, Latest Telugu, Powered Tool, Youtube-Te

యూట్యూబ్ లో వీడియోలను ఇతర భాషలలోకి డబ్ చేయడం సులభతరం చేసేందుకు ఈ సరికొత్త టూల్ ను తీసుకురానుంది.ఈ డబ్బింగ్ టూల్ అనేది ఆలౌడ్ టీమ్ ఈ ప్రాజెక్టులో పని చేస్తుంది.అలౌడ్( Aloud ) అంటే గూగుల్ ఏరియా 120 ఇంక్యుబేటర్ నుండి AI – ఆధారిత డబ్బింగ్ సేవా సంస్థ.అయితే అలౌడ్ ప్రస్తుతం కొన్ని భాషలకు మాత్రమే మద్దతు ఇవ్వనుంది.

భవిష్యత్తులో మరిన్ని భాషలకు విస్తరించే అవకాశం ఉంది.ప్రస్తుతం ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్ భాషలను సులభంగా ఈ టూల్ తో డబ్బింగ్ చేసే అవకాశం ఉంది.

Telugu Aloud, Google Aloud, Google Area, Latest Telugu, Powered Tool, Youtube-Te

యూట్యూబ్ వీడియోలు ఒక భాష నుండి మరొక భాషలోకి డబ్బింగ్ చేసే ముందు ఈ టూల్ ఆ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.ఆ తరువాత వినియోగదారుడిని సమీక్షించడానికి, సవరించడానికి ట్రాన్స్ క్రిప్షన్లను చూపిస్తుంది.అనంతరం ఆ వీడియోకు డబ్బింగ్ ని అనువదించి ప్రొడ్యూస్ చేస్తుంది.ఈ డబ్బింగ్ టూల్ ఏ విధంగా పనిచేస్తుందో వివరించడానికి గూగుల్ అలౌడ్( Google Aloud ) బృందం ఒక వీడియోను షేర్ చేసింది.

మరికొన్ని రోజుల్లోనే యూట్యూబ్ అన్నింటికంటే ఎక్కువగా వ్యక్తీకరణ, లిప్ సింక్, అనువాద ఆడియో ట్రాక్ లను సృష్టికర్త వాయిస్ లా ధ్వనింప చేయడానికి కృషి చేయనుంది.అయితే ఈ ఫీచర్లను 2024 లోపు జోడించి అందుబాటులోకి తెచ్చే పనిలో కంపెనీ నిమగ్నం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube