నరేష్ ను మరోసారి టార్గెట్ చేసిన రమ్య రఘుపతి.. గౌరవం దెబ్బ తింటోందంటూ?

నరేష్, పవిత్ర లోకేష్( Naresh, pavithra Lokesh ) ప్రధాన పాత్రల్లో తెరకెక్కి థియేటర్లలో విడుదలైన మళ్లీ పెళ్లి భారీ బడ్జెట్, భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కినా ఈ సినిమా ప్రేక్షకుల మెప్పును పొందడంలో ఫెయిలైందనే సంగతి తెలిసిందే.అయితే మళ్లీ పెళ్లి సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా ఓటీటీలో రిలీజ్ కావడం గమనార్హం.

 Ramya Raghupati Once Again Targets Naresh Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

ఈ రెండు ఓటీటీలు ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశాయని సమాచారం అందుతోంది.

అయితే రమ్య రఘుపతి( ramya raghupati ) మరోసారి నరేష్ ను టార్గెట్ చేయడం గమనార్హం.

అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీలకు( Amazon Prime, Aha OTT ) రమ్య రఘుపతి నోటీసులు జారీ చేశారు.ఈ సినిమా స్ట్రీమింగ్ ఆపేయాలని రమ్య రఘుపతి నోటీసులు జారీ చేయడం గమనార్హం.

రమ్య రఘుపతి లీగల్ నోటీసులు జారీ చేయడంతో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ ఆపేయగా ఆహాలో మాత్రం స్ట్రీమింగ్ కొనసాగుతోంది.థియేటర్లలో ఈ సినిమాను ఆపలేకపోయినా ఓటీటీలో మాత్రం ఆపేయడం గమనార్హం.

రమ్య రఘుపతి లీగల్ నోటీస్ లలో తన గౌరవం దెబ్బ తినేలా ఈ సినిమా ఉందని చెప్పుకొచ్చారు.సృజనాత్మక భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వాస్తవాలను పక్కదారి పట్టించడం కరెక్ట్ కాదని నోటీసుల్లో పేర్కొన్నారు.తన పరువు తీయడానికే ఈ సినిమాను తీశారని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు.ఇలాంటి పనుల కొరకు సినిమా వంటి కళారూపాన్ని ఉపయోగించుకోవడం రాంగ్ అని ఆమె అన్నారు.

లీగల్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఆహా ఓటీటీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.ఈ సినిమా స్ట్రీమింగ్ ఆగిపోతే మాత్రం నరేష్ కు ఆర్థికంగా భారీ స్థాయిలో నష్టం కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.రమ్య రఘుపతి ఇచ్చిన ట్విస్ట్ విషయంలో మళ్లి పెళ్లి మేకర్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube