యూట్యూబ్ లో సరికొత్తగా పవర్డ్ డబ్బింగ్ టూల్.. ఇకపై డబ్ చేయడం అత్యంత సులభం..!

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ గా యూట్యూబ్( Youtube ) కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేసేవారికోసం.వీడియోలు వీక్షించే వారి కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.

ప్రస్తుతం తాజాగా యూట్యూబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డబ్బింగ్ టూల్( Powered Dubbing Tool ) తీసుకువస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది.

"""/" / యూట్యూబ్ లో వీడియోలను ఇతర భాషలలోకి డబ్ చేయడం సులభతరం చేసేందుకు ఈ సరికొత్త టూల్ ను తీసుకురానుంది.

ఈ డబ్బింగ్ టూల్ అనేది ఆలౌడ్ టీమ్ ఈ ప్రాజెక్టులో పని చేస్తుంది.

అలౌడ్( Aloud ) అంటే గూగుల్ ఏరియా 120 ఇంక్యుబేటర్ నుండి AI - ఆధారిత డబ్బింగ్ సేవా సంస్థ.

అయితే అలౌడ్ ప్రస్తుతం కొన్ని భాషలకు మాత్రమే మద్దతు ఇవ్వనుంది.భవిష్యత్తులో మరిన్ని భాషలకు విస్తరించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్ భాషలను సులభంగా ఈ టూల్ తో డబ్బింగ్ చేసే అవకాశం ఉంది.

"""/" / యూట్యూబ్ వీడియోలు ఒక భాష నుండి మరొక భాషలోకి డబ్బింగ్ చేసే ముందు ఈ టూల్ ఆ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.

ఆ తరువాత వినియోగదారుడిని సమీక్షించడానికి, సవరించడానికి ట్రాన్స్ క్రిప్షన్లను చూపిస్తుంది.అనంతరం ఆ వీడియోకు డబ్బింగ్ ని అనువదించి ప్రొడ్యూస్ చేస్తుంది.

ఈ డబ్బింగ్ టూల్ ఏ విధంగా పనిచేస్తుందో వివరించడానికి గూగుల్ అలౌడ్( Google Aloud ) బృందం ఒక వీడియోను షేర్ చేసింది.

మరికొన్ని రోజుల్లోనే యూట్యూబ్ అన్నింటికంటే ఎక్కువగా వ్యక్తీకరణ, లిప్ సింక్, అనువాద ఆడియో ట్రాక్ లను సృష్టికర్త వాయిస్ లా ధ్వనింప చేయడానికి కృషి చేయనుంది.

అయితే ఈ ఫీచర్లను 2024 లోపు జోడించి అందుబాటులోకి తెచ్చే పనిలో కంపెనీ నిమగ్నం అయ్యింది.