వాట్సప్ లో త్వరలో రానున్న సరికొత్త ఫీచర్.. !?

నేటి సమాజంలో వాట్సప్ గురించి తెలియని వారంటూ ఉండరు.చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరు వాట్సప్ ని వాడుతూనే ఉన్నారు.

ప్రపంచం మొత్తం మీద వాట్సాప్ కు విపరీతమైన ఆదరణ కలిగి ఉంది.అయితే గత రెండు నెలల నుంచి వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువగా ఉపయోగించే వాటిలో వాట్సాప్ అన్నిటి కంటే ముందు వరుసలో ఉంది.ఇక సోషల్ మీడియా యాప్ లలో వాట్సాప్ కంటే ముందు ఫేస్‌బుక్ వంటివి వచ్చినప్పటికీ మార్కెటింగ్ విషయంలో కొద్దిగా బిన్నంగా ఉంది.

ఇక వాట్సప్ వాడుకలోకి వచ్చిన దగ్గర నుండి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లుని తీసుకొస్తుంది.తాజాగా వాట్సప్ సంస్థ సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.

Advertisement

ఇక వాట్సాప్ వీడియోలను తమ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేయడానికి ముందు అందులో గల వాయిస్ ను మ్యూట్ చేయడానికి సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి రానున్నది.తాజాగా WABetaInfo యొక్క కొత్త నివేదిక ప్రకారం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం రూపొందించబడిందని సంస్థ యాజమాన్యం తెలిపారు.

అలాగే త్వరలో బహిరంగంగా కూడా విడుదల చేయబడుతుందని వెల్లడించారు.

2.21.3.13 కొత్త అప్ డేట్ విడుదల కానున్నట్లు తెలిపారు.ఇక ఇందులో వీడియోను మ్యూట్ చేయగల టోగుల్ ఉంటుంది.

ఈ టోగుల్ ద్వారా వీడియోను ట్రిమ్ చేయడం, ఏదైనా టెక్స్ట్ ను జోడించడం, స్టిక్కర్లు వంటి మరిన్ని ఇతర ఎడిటింగ్ ఎంపికలను కూడా జోడించడానికి అనుమతిని ఇస్తుందని నివేదికలో అందించిన స్క్రీన్ షాట్ చూపిస్తుందని తెలిపారు.ఇక ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్ గుర్తించబడినప్పటికీ ఇది iOS తో పాటు వెబ్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటుంది అని గమనించాలి మరి.

చనిపోయిన భార్యకు కర్మకాండ నిర్వహించిన భర్త.. కానీ, భర్త ముందు ప్రత్యక్షమైన భార్య.. అసలు ఏమైందంటే?
Advertisement

తాజా వార్తలు