హైదరాబాద్ హెచ్యూటీ ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.
ఇందులో భాగంగా బాబానగర్, చంద్రాయన్ గుట్టలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇద్దరిని అదుపులోకి తీసుకుంది.కాగా ఉగ్రకుట్ర కేసులో ఇటీవల హైదరాబాద్ లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.అటు భోపాల్ లో పదకొండు మంది అరెస్ట్ కాగా ఇప్పటివరకు అరెస్ట్ ల సంఖ్య 19కి చేరింది.







