నాటింగ్‌హామ్ కత్తిపోటు కేసు విచారణకు అధ్యక్షత వహించిన భారత సంతతి న్యాయమూర్తి...

కొద్ది రోజుల క్రితం ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్‌లో( Nottingham ) ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

వారిలో బ్రిటిష్ ఇండియన్ టీనేజర్ గ్రేస్ ఓ మల్లీ కుమార్( Grace OMalley Kumar ) కూడా ఉంది.

ఆమె నాటింగ్‌హామ్ యూనివర్సిటీలో చదువుకుంటోంది.అయితే వాల్డో మెండిస్( Valdo Mendes ) అనే 31 ఏళ్ల వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున గ్రేస్ ఫ్రెండ్‌పై కత్తితో దాడి చేస్తుండగా ఆమె అడ్డుకుంది.

ఈ క్రమంలో ప్రాణాలు కూడా కోల్పోయింది.మెండిస్ వీరిద్దరిని చంపేసిన తర్వాత ఒక స్కూల్ కేర్‌టేకర్‌ను కూడా హత్య చేశాడు.

కాగా తాజాగా ఈ నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు.వారి హత్యకు పాల్పడినట్లు మెండిస్‌పై అభియోగాలు మోపారు.

Advertisement

ఈ కేసును భారత సంతతికి చెందిన న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ శాంత్ విచారించారు.కోర్టు విచారణలో బాధిత కుటుంబాల వారు ప్రశాంతంగా, గౌరవంగా ప్రవర్తించినందుకు ప్రశంసించారు.

నిందితుడు దొంగలించిన ఓ వ్యాన్‌తో మరో ముగ్గురికి హాని కలిగించడానికి ప్రయత్నించినట్లు కూడా ఆరోపణలు రాగా వాటిని పరిశీలించారు.

జస్టిస్ నిర్మల్ గినియా-బిస్సావ్, పోర్చుగల్ నుంచి ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న నిందితుడిని రిమాండ్‌లో ఉంచారు.అంటే అతని విచారణ వరకు అతను జైలులోనే ఉంటాడు.విచారణ 2024, జనవరి 12న ప్రారంభం కానుంది.

ఈలోగా, అనుమానితుడు సెప్టెంబర్ 25న మరొక కోర్టు విచారణను కలిగి ఉంటాడు, అక్కడ అతను తన పిటిషన్‌ను నమోదు చేస్తాడు.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

ఈ దాడిలో గ్రేస్ ఓ మల్లీ కుమార్, ఆమె స్నేహితురాలు బర్నాబీ వెబర్, ఇయాన్ కోట్స్ అనే స్కూల్ కేర్‌టేకర్ ప్రాణాలు కోల్పోయారు.ఘటనలో ఉపయోగించిన వ్యాన్ ఇయాన్ కోట్స్‌కు చెందినది.వ్యాన్ ఢీకొన్న ఒక వ్యక్తి ఇంకా ఆసుపత్రిలో ఉన్నాడు, అయితే అతని పరిస్థితి నిలకడగా ఉంది, మరో ఇద్దరు ఆసుపత్రి నుంచి విడుదలయ్యారు.

Advertisement

ఈ సంఘటన జరిగినప్పటి నుంచి, బాధితులను గుర్తుచేసుకోవడానికి చాలా మంది ప్రజలు నాటింగ్‌హామ్‌లో గుమిగూడారు.

తాజా వార్తలు