ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కార్ టెస్లా అని చెప్పవచ్చు.టెస్లా కార్లలో వాడిన టెక్నాలజీ మరే ఇతర కారులో వాడలేదంటే అతిశయోక్తి కాదు.
ఈ కంపెనీ కార్లలో చేసే డ్రైవింగ్ ఎక్స్రియన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది.అయితే ఇవి ఇంకా అధికారికంగా ఇండియాలో సేల్ కావడం లేదు.
కానీ దీనిపై ఇష్టంతో కొందరు సెలబ్రిటీలు అమెరికా, ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకున్నారు.వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
జెనీలియా హస్బెండ్ రితేష్
:
ప్రముఖ హీరోయిన్ జెనీలియా డిసౌజా కొద్ది రోజుల క్రితం తన భర్త ‘రితేష్ దేశ్ముఖ్‘ కోసం టెస్లా కంపెనీకి చెందిన ‘మోడల్ ఎక్స్’ కారును కొని గిఫ్టుగా అందించింది.బర్త్డే స్పెషల్గా ఈ కారును అందించడంతో ఆమె భర్త ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి.రితేష్ టెస్లా మోడల్ ఎక్స్ కారు రెడ్ కలర్ లో అద్భుతంగా కనిపిస్తుంది.
పూజా బాత్రా:
తెలుగులో సిసింద్రీ, గ్రీకువీరుడు సినిమాలలో నటించి మెప్పించిన బాలీవుడ్ నటి పూజా బాత్రా టెస్లా మోడల్ 3 కారును కొనుగోలు చేసింది.టెస్లా కంపెనీ తీసుకొచ్చిన అత్యంత చౌకైన కారు ఇది.పూజా బాత్రా ముంబైలో వినియోగిస్తున్న ఈ టెస్లా మోడల్ 3 బ్లాక్ కలర్లో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది.
ప్రశాంత్ రుయా:
ఎస్సార్ క్యాపిటల్ డైరెక్టర్ ప్రశాంత్ రుయా టెస్లా మోడల్ ఎక్స్ కారును 2017లోనే దిగుమతి చేసుకున్నారు.అతను దీనిని ముంబై రోడ్లపై తిప్పుతారు.
ముఖేష్ అంబానీ:
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ టెస్లా మోడల్ ఎస్ బ్లూ కలర్ కారును కొనుగోలు చేశారు.