టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాను ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్ విడుదల చేసింది.2022 సంవత్సరంలో తెలుగు ప్రేక్షకులు అత్యధికంగా అభిమానించిన.సోషల్ మీడియాలో సందడి చేసిన హీరోయిన్స్ జాబితాను విడుదల చేయడం జరిగింది.ఓర్మాక్స్ మీడియా 2022 లో మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ జాబితాను విడుదల చేయడం జరిగింది.ఈ జాబితాలో సమంత నెం.1 స్థానంలో నిలిచింది.ఆ తర్వాత స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచింది.మూడవ స్థానంలో అనుష్క నిలిచింది.
ఈ ముగ్గురు కూడా గత ఏడాది పెద్దగా సినిమాలు చేయలేదు.సమంత యశోద సినిమా తో వచ్చింది కానీ పెళ్లి మరియు తల్లి అవ్వడం వల్ల కాజల్ అగర్వాల్ ఒక్క సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోయింది.
ఇక అనుష్క సంగతి సరే సరి.ఆమె కనీసం కొత్త సినిమా అప్‌డేట్ ఇవ్వలేదు.అలాగే సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేయడం లేదు.
అయినా కూడా ఈ జాబితాలో నెం.3 స్థానంలో నిలవడం గొప్ప విషయం అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ప్రముఖంగా జరుగుతున్న అనుష్క యొక్క పెళ్లి మరియు ఆమె ఇతర విషయాల గురించి చర్చ వల్లే నెం.3 స్థానంలో నిలిచింది అనడంలో సందేహం లేదు.గత ఏడాది తెగ హడావుడి చేసిన కృతి శెట్టి మరియు రష్మిక మందన్నా ఇతరులు టాప్ 5 లో నిలువలేదు.సాయి పల్లవి కూడా గత ఏడాది పెద్దగా సినిమాలు చేయకున్నా ఈ జాబితాలో నెం.5 స్థానంలో నిలిచి తన సత్తా చాటింది.నెం.4 స్థానంను బుట్ట బొమ్మ పూజా హెగ్డే నిలిచింది.హీరోయిన్స్ సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారని దీన్ని బట్టి అర్థం అయ్యింది.