భార్యను హత్య చేసి ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన భర్త..!

గతంతో పోలిస్తే ఇటీవలే కాలంలో చాలా చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద దారుణాలకు పాల్పడుతున్నారు.

సమాజంలో ఉండే కొంతమంది మనుషులకు రాను రాను ఓపిక, విచక్షణా జ్ఞానం నశించి తమ కుటుంబాలను తామే నాశనం చేసుకుంటున్నారు.

భవిష్యత్తు కాలంలో మానవత్వం అనే మాటకు సమాజంలో చోటు అనేదే ఉండదు.ఇలాంటి కోవలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా భార్యను హత్య చేసి భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన మెదక్ లోని నారాయణఖేడ్( Narayankhed ) మండలం జూకల్ లో సోమవారం రాత్రి చోటుచేసుకుని తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపింది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

పోలీసులు( Police )తెలిపిన వివరాల ప్రకారం.మండల పరిధిలోని వాసర్ కు చెందిన రేణుక(22)కు, నారాయణఖేడ్ మండలం జూకల్ కు చెందిన కుందేలు శర్ణప్ప(25)కు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది.కొంతకాలం పాటు వీరి కాపురం సాఫీగానే సాగింది.

Advertisement

కానీ కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. శర్ణప్ప ప్రతిరోజు భార్యను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు.

చాలాసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించిన శర్ణప్ప ప్రవర్తనలో కాస్త కూడా మార్పు అనేదే రాలేదు.

ఇంకా వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి.ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి భార్య బంధువైన జగదేవీ కు శర్ణప్ప ఫోన్ చేసి రేణుకను చంపేశాను వచ్చి రేణుక శవాన్ని తీసుకెళ్లాలని చెప్పాడు.ఈ విషయం విన్న జగదేవీ మంగళవారం ఉదయం మిగతా బంధువులతో కలిసి జూకల్( Jukal Village ) గ్రామ శివారులో అంతా గాలించారు.

గ్రామ శివారులో ఉండే బావిలో రేణుక మృతదేహం లభించింది.భర్త, అతని కుటుంబ సభ్యులే రేణుకను హత్య చేసి బావిలో పడేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విద్యాచరణ్ రెడ్డి తెలిపారు.

నాని నిర్మాణంలో మెగాస్టార్ చిరు...డైరెక్టర్ ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు