మురారి సినిమా రీ రిలీజ్ మీద భారీగా పెరుగుతున్న హైప్...కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి( Mahesh Babu ) చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది.

ఇక ఆయన సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆయన అభిమానుల నుంచి విశేషమైన స్పందన అయితే వస్తుంది.

ఇక ఆగస్టు 9వ తేదీన ఆయన పుట్టినరోజు కావడం తో ఆయన చేసిన మురారి( Murari ) సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంభందించిన ప్రమోషన్స్ ను కూడా వివిధ రూపాల్లో చేస్తూ సినిమా మీద హైప్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఈ సినిమా మాత్రం భారీ రికార్డులను కూడా బ్రేక్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

మహేష్ బాబు కెరియర్ లో మొదటి భారీ సక్సెస్ గా మారిన మురారి సినిమా ఇప్పుడు కూడా మంచి వసూళ్లను రాబట్టి రీ రిలీజ్ ట్రెండ్ కి సరికొత్త అర్థం చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాలు రీ రిలీజ్ లో భారీ వసూళ్లను రాబడుతున్నాయి.

Advertisement

అలాగే ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు కూడా అదే తరహాలో ముందుకు సాగబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఆగస్టు 9 న మొదటి రెండు షోలు ఒక్కడు సినిమాని, మరో రెండు షోలు మురారి సినిమాను ప్లే చేస్తున్నారట.ఒక్కడు మీద అంత హైప్ అయితే లేదు.కానీ మురారి మీద మాత్రం మన స్పందన వస్తుంది.

కృష్ణవంశీ( Krishna Vamsi ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అటు కృష్ణవంశీ కి, ఇటు మహేష్ బాబుకి మంచి గుర్తింపుని తీసుకురావడమే కాకుండా కుటుంబ కథ చిత్రం గా కూడా మంచి పేరును సంపాదించుకుంది.మరి ఈ సినిమా ఇప్పుడు ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

ఎస్వీ కృష్ణారెడ్డిని టార్చర్ చేసిన రాజేంద్రప్రసాద్.. దాంతో అతనే నష్టపోయాడు..??
Advertisement

తాజా వార్తలు