అతగాడు గూఢచర్యంలో ఆరితేరిన అమెరికానే ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువులు నీళ్లు తాగించాడు.ఈ క్రమంలో అమెరికా దేశ రహస్యాలను రష్యా దేశానికి పెద్ద మొత్తంలో అమ్మాడు.
అయితే ఆ ‘డబుల్ ఏజెంట్’( Double Agent )ను పట్టుకునేందుకు యూఎస్ ఎఫ్‌బీఐకి 20 ఏళ్లు పట్టిందంటే మీరు నమ్ముతారా? అలా వారు అతనిని పట్టుకోవడానికి తమ మధ్యలోనే ఉన్న ఆ ఏజెంట్‌కు నకిలీ ఉద్యోగాన్ని సృష్టించి, వలపన్ని మరీ పట్టుకున్నారు.అవును, ఎఫ్‌బీఐ (అమెరికా నిఘా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) చరిత్రలో అత్యంత దారుణమైన గూఢచారుల్లో రాబర్ట్ హన్‌సెన్( Robert Hansen ) ఒకరు.
దాదాపు 20 ఏళ్ల పాటు అమెరికా రహస్యాలని రష్యాకు అమ్మేసిన ఈ మాజీ ఏజెంట్ తాజాగా అక్కడి జైల్లో చనిపోయారు.

ఇకపోతే, హన్‌సెన్ ( Hansen )ద్రోహం కారణంగా అమెరికాలో చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఎఫ్‌బీఐ ఆరోపిస్తోంది.దాదాపు 300 మంది ఏజెంట్లతో నిఘా పెట్టి, ఎఫ్‌బీఐ ( FBI )ఆయన్ను పట్టుకున్నట్టు తెలుస్తోంది.2001లో హన్‌సెన్ అరెస్టు నిఘా విభాగంలో ప్రకంపనలు సృష్టించిందని చెప్పుకోవచ్చు.ఆయన గూఢచర్య జీవితంపై వార్తా కథనాలు కూడా అనేకరకాలుగా ప్రచురితమయ్యాయి.సుమారు 2 దశాబ్దాల తర్వాత ఈ మాజీ ఏజెంట్ హన్‌సెన్ చనిపోయారు.అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కొలరాడోలోని జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న హన్‌సెన్, సోమవారం అచేతనంగా కనిపించారు.

ఇకపోతే 79 ఏళ్లున్న హన్‌సెన్ వయోభారంతో చనిపోయి ఉంటాడని అధికారులు చెబుతున్నారు.ఆయన మరణంపై ఎఫ్‌బీఐ నుంచి రిటైర్ అయిన 70 ఏళ్ల గర్షియా తీవ్రంగా స్పందించారు.అలాంటి వ్యక్తికి మంచి విముక్తి దొరికిందన్నారు.
కాలేజీలో రష్యన్( Russian ) చదువుకున్న హన్‌సెన్.ఒక దశాబ్దం తర్వాత ఆయన నిఘా ఏజెన్సీ నిబంధనలను ఉల్లంఘించారు.1985 నుంచి అమెరికా ప్రభుత్వ నిఘా సంస్థలోనే పనిచేస్తూ విధ్వంసకర ద్రోహిగా మారారు.రహస్యాలను యూఎస్‌ఎస్‌ఆర్, రష్యాకు అమ్ముకున్నారు.
అంతే కాకుండా గూఢచారుల వివరాలను కూడా వారికి చేరవేసాడు.హన్‌సెన్ నేరాలపై దాఖలు చేసిన 100 పేజీల అఫిడవిట్ ప్రకారం, ఈ కేసులో యూఎస్ మూలాలున్న ముగ్గురు జైలు పాలయ్యారు.
మరో ఇద్దరికి మరణ శిక్ష పడినట్టు సమాచారం.
