సాధారణంగా కూలిపోవడానికి రెడీగా ఉన్న ఇళ్లను ఎవరూ కొనుగోలు చేయరు.ఎందుకంటే అందులో నివసించడం చాలా డేంజర్.
అమెరికా( America )లోని కేప్ కాడ్ అనే ప్రదేశంలో సముద్ర తీరాన ఇలాంటి ఓ ఇల్లు ఉంది.ఈ ఇల్లు త్వరలోనే కూలిపోతుందని, సముద్రంలో కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరించినా, 59 ఏళ్ల డేవిడ్ మూట్ అనే వ్యక్తి ఆ ఇల్లు కొన్నాడు.
నమ్మడానికి షాకింగ్‌గా అనిపిస్తుంది కదూ.మరి అతను అసలు దాన్ని అతను ఎందుకు కొనుగోలు చేశాడో తెలుసుకుందాం.
సముద్ర తీరం క్రమంగా సముద్రంలో కలిసిపోతున్న కారణంగా, తీర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు మునిగిపోయే ప్రమాదం ఉంది.ఇలాంటి ప్రాంతాల్లో ఇళ్ల విలువ తగ్గుతుంది.మొదట ఆ ఇంటి ధరను చాలా తక్కువగా పెట్టారు.కానీ, సముద్రం వల్ల ఇల్లు మునిగిపోతుందనే భయంతో ఎవరూ కొనలేదు.దీంతో సెల్లార్ ఇల్లు చాలా తక్కువ ధరకు అమ్మడానికి ఒప్పుకున్నాడు.డేవిడ్ ( David )జీవితం చాలా చిన్నదని, అందుకే ఎలాంటి భయాలు పెట్టుకోకుండా నచ్చినట్లు ఆనందించాలని అనుకున్నాడు.
ఇల్లు మునిగిపోయినా, తన జీవిత కాలంలోనే అది జరిగే అవకాశం లేదని అనుకున్నాడు.
ఇల్లు కొనుగోలు చేసే ముందు, డేవిడ్ ఇంజనీర్లతో మాట్లాడాడు.ఇంజనీర్లు ఆ ఇల్లు ఉన్న ప్రాంతంలో సముద్రం ముందుకు కదులుతుందని, ఇసుక వేగంగా సముద్రంలో కలిసిపోతోందని అంచనా వేశారు.అలాగే, ఇసుకను పట్టుకుని ఉంచేలా బీచ్ గ్రాస్ గడ్డిని పెంచడం, ఇల్లు కొంచెం వెనక్కి జరపడం లాంటి పనులు చేస్తే సముద్రం ఇల్లు మునిగిపోకుండా కాపాడవచ్చని చెప్పారు.
డేవిడ్ తాను బతికే వరకు ఆ ఇంట్లో ఉండాలని అనుకుంటున్నాడు.అంతేకాకుండా, అనారోగ్యంతో బాధపడే వ్యక్తులకు ఆ ఇంట్లో కొంతకాలం ఉండే అవకాశాన్ని కల్పించి వారికి లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేయాలని ఆశపడుతున్నాడు.
ఇకపోతే కేప్ కాడ్‌లోని సముద్ర తీరం ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా లోపలికి జరుగుతుంది.అంటే, సముద్రం ఇళ్లకు దగ్గరకు వస్తుంది.ఇలాంటి సమస్య తూర్పు తీరంలో చాలా చోట్ల ఉంది.ముఖ్యంగా, శీతాకాలంలో వచ్చే తుఫానుల సమయంలో సముద్రం ఇళ్లను ముంచెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అందుకే, సముద్ర తీరానికి దగ్గరగా ఇళ్లు కొనడం ప్రమాదకరం.