సోనాలి బింద్రే.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎంతో అందంగా.క్యూట్ గా ఉండడమే కాదు అదిరిపోయే నటనతో ఎంతోమంది కుర్రాళ్ల మనసు దోచుకుంది.ఎన్నో తెలుగు, హిందీ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను సొంతం చేసుకుంది.ఇక ఖడ్గం సినిమాలో ఉన్న నువ్వు నువ్వు సాంగ్ లో ఆమెను చుసిన వారు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు.
అంత అందంగా అద్భుతంగా నటించిన ఈ నటి క్యాన్సర్ బారిన పడి ఇప్పుడిప్పుడే ఆరోగ్యంగా తయారయ్యింది.
ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదిక యాక్టీవ్ గా ఉండేందుకు ఏం చెయ్యాలి? ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి వ్యాయామాలు చెయ్యాలి.ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చెప్తూ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరగా ఉంటుంది సోనాలి బింద్రే.ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయిన తన అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటోంది సోనాలి బింద్రే.
అలాంటి సోనాలి బింద్రే కూడా ఒకానొక సమయంలో జైలుకు వెళ్ళొచ్చింది.కానీ కేవలం అంటే కేవలం గంటలో జైలు నుంచి బయటకు వచ్చింది.
ఎందుకు వెళ్ళింది? ఏ కారణం వల్ల వెళ్లింది ? గంటలో ఎలా బయటకు వచ్చింది అనే కదా మీ డౌట్.అక్కడికే వస్తున్న.
ఓ మతాన్ని కించపరిచే విధంగా డ్రెస్సు ధరించి ఫోటో షూట్ చేయించింది అనే కారణం వల్ల ముంబైలో అరెస్ట్ అయ్యింది.అయితే అరెస్ట్ అయినా గంటలోనే 12 వేలు ఖర్చు పెట్టి ఆమె బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చింది.
పసుపు రంగు డ్రెస్సుపై ఓం నమో శివాయ అనే పదాలు ఉన్న కుర్తా ధరించి ఆమె అప్పట్లో అరెస్ట్ అయ్యింది.