నిలకడగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం..!

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణహాని లేదని తెలిపారు.

అయితే కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై కొందరు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.భయభ్రాంతులకు గురి చేసి లబ్ధి పొందాలని భావిస్తున్నారన్నారు.

The Health Of New MP Prabhakar Reddy Is Steady..!-నిలకడగా ఎం�

దాడి ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందన్న మంత్రి హరీశ్ రావు పూర్తి విచారణ చేసి నిందితులు ఎవరో తేలుస్తామని స్పష్టం చేశారు.అయితే దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి తిరిగి వస్తున్న సమయంలో రాజు అనే వ్యక్తి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

దీంతో గజ్వేల్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆయనను సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!

తాజా వార్తలు