పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం.పెళ్లి చేసుకుని హాయిగా పిల్లలతో జీవించాలని ప్రతిఒక్కరూ ఆశపడుతూ ఉంటారు.
పెళ్లిని అందరికీ తెలిసేలా చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు.స్నేహితులు, బంధుమిత్రులందరినీ పెళ్లికి ఆహ్వానిస్తారు.
రూ.లక్షల్లో ఖర్చు పెట్టి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటారు.
పెళ్లి తర్వాత తమ జీవితం బాగుంటుందని, భవిష్యత్తు ఆనందంగా ఉంటుందని అందరూ భావిస్తారు.అయితే పెళ్లి చేసుకుంటే జీవితంగా ఆనందంగా ఉంటుందని భావించిన ఓ వధువుకు పెళ్లి రోజే షాక్ తగిలింది.
పెళ్లి( wedding ) రోజే వధువుకు వరుడు నరకం చూపించాడు.దీంతో వరుడిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.ఇందులో పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది.పెళ్లిలో డీజే ఏర్పాటు చేయగా.పెళ్లికి వచ్చిన బంధువులు, అతిథులు డీజేను ఎంజాయ్ చేస్తున్నారు.వధూవరులు వేదికపైకి ఎక్కి డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు.వధువును పట్టుకుని వరుడు గుడ్రంగా గిరగిరా తిరగడం మొదలుపెట్టాడు.అయితే ఆగకుండా అలాగే తిప్పడంతో వధువు స్పృహ తప్పి పడిపోయింది.
అయితే వధువు కింద పడినా వరుడు అలాగే ఉండిపోయాడు. ఆమెను కనీసం పైకి కూడా లేపకుండా ఏమీ పట్టనట్లు ఉండిపోయాడు.వధువు కింద పడుతుంటే కనీసం ఆమెను పట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు.
బండరాయిలా అలాగే చూస్తూ ఉండిపోయాడు.దీంతో వరుడిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భార్య కింద పడిపోతున్నా కనీసం పట్టించుకోకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మను చౌదరి అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
దీంతో వరుడి తీరుపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.వరుడికి ఆహాంకారం మాములుగా లేదని, భార్య పట్ల అసలు ప్రేమ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.