పెద్దల పని మేం చేస్తున్నాం: అయోవాలో గ్రేటా థన్‌బెర్గ్

పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై పోరాటం చేస్తున్న స్వీడిష్ యువ సామాజిక కార్యకర్త గ్రేటా థన్‌బెర్గ్ శుక్రవారం అయోవాలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

పెద్దలంతా చిన్న పిల్లల మాదిరిగా తప్పుచేస్తున్నారని.కానీ పిల్లలు, బాలికలు మాత్రం పెద్దల లాగా బాధ్యత తీసుకుంటున్నామని సెటైర్లు వేసింది.

అలాగే ప్రపంచంలోని దేశాధినేతలంతా చిన్న పిల్లల్లాగా వ్యవహరిస్తున్నారని గ్రేటా ఎద్దేవా చేసింది.పర్యావరణ పరిరక్షణ విషయంలో తాము ప్రతిసారి నేతలను అడగలేమని వారు తమను విస్మరిస్తూనే ఉన్నారని థన్‌బెర్గ్ తెలిపారు.

ఈ సారి మాత్రం అధినేతలు స్పందించకపోతే తామే బాధ్యత తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

కార్బన ఉద్గారాలపై సమరం చేస్తున్న గ్రేటా థన్‌బెర్గ్ ఈ ఏడాది ఆగస్టులో సెయిల్ బోట్ ద్వారా అమెరికా చేరుకుంది.అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ ముందు నిరసనకు దిగి అందరి దృష్టిని ఆకర్షించిన గ్రేటా.పర్యావరణ మార్పులపై సెప్టెంబర్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రసంగించింది.

ఈ సందర్భంగా ప్రకృతిపై నేతల తీరును కడిగిపారేసింది.

Advertisement

తాజా వార్తలు