దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు ఒక శుభవార్తను అందచేసింది.ఎస్‌బీఐ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై వడ్డీరేటు పెంచింది.ఈ నేపథ్యంలో బేస్ రేట్‌ను 0.10% లేదా 10 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.సవరించిన రేటు ప్రకారం పెరిగిన వడ్డీ రేట్లు ఈనెల అంటే 2021, డిసెంబర్ 15 నుంచి అమలుకానున్నాయి.అంటే వార్షికంగా 7.55% వడ్డీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.నిజానికి కొన్ని కారణాలు వలన ఈ ఏడాది మొదట్లోనే ఎస్‌బీఐ బేస్ రేట్‌ను 0.5% మేర తగ్గించడంతో వడ్డీరేట్లు దాదాపు 7.45% కి దిగొచ్చాయి.ఈ క్రమంలోనే భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఫిక్స్ డ్ డిపాజిట్స్ పై కనీస వడ్డీరేటును నిర్ణయించింది.
అయితే కేంద్ర బ్యాంకు నిర్ణయించిన కనీస వడ్డీరేటు కన్నా తక్కువ వడ్డీరేటు అమలు చేసే అధికారం వేరే బ్యాంకులకు లేదు.అందుకే ఎవరయితే రూ.2 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తారో వారికి ఎస్‌బీఐ వడ్డీరేటును పెంచింది.అయితే రూ.2 కోట్లకు దిగువన ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.మరి ఫిక్స్డ్ డిపాజిట్ లపై ఎస్‌బీఐ ఇచ్చే వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా.7 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్ల పై సాధారణ ప్రజలకు 2.90%, అలాగే సీనియర్ సిటిజన్లకు 3.4% గా ఉన్నాయి.46 రోజుల నుంచి 170 రోజులపాటు అయితే సాధారణ ప్రజలకు 3.90% గాను సీనియర్ సిటిజన్లకు 4.40% గాను ఇవ్వనుంది.

180 రోజుల నుంచి 210 రోజులకు గాను సాధారణ ప్రజలకు 4.4%, సీనియర్ సిటిజన్లకు 4.9% గా వడ్డీరేట్లు ఉన్నాయి.అలాగే 211 రోజుల నుంచి ఏడాదికాలం పాటు సాధారణ ప్రజలకు 4.4%, సీనియర్ సిటిజన్లకు 4.9% శాతంగా ఉన్నాయి.ఏడాది నుంచి రెండేళ్ల పాటు అయితే సాధారణ ప్రజలకు 5 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.5% గా వడ్డీరేట్లు వున్నాయి.రెండేళ్ల నుంచి మూడేళ్ల కాలపరిమితికి సాధారణ ప్రజలకు 5.1%, సీనియర్ సిటిజన్లకు 5.6% గా ఉన్నాయి.అలాగే మూడేళ్ల నుంచి ఐదేళ్ల సమయం పాటు అయితే సాధారణ ప్రజలకు 5.3%, సీనియర్ సిటిజన్లకు 5.8% ఇస్తున్నారు.ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు అయితే సాధారణ ప్రజలకు 5.4%, సీనియర్ సిటిజన్లకు 6.2%గా వడ్డీ రేట్లు ఉన్నాయి.