Buggana Rajendranath : బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయం..: మంత్రి బుగ్గన

ఏపీ అసెంబ్లీలో మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్( Buggana Rajendranath ) ప్రారంభించారు.

గత ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు.

మ్యానిఫెస్టోను సీఎం జగన్( CM Jagan ) పవిత్రగ్రంధంగా భావించారని తెలిపారు.బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.

ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అందిస్తుందని తెలిపారు.రూ.3,367 కోట్లతో విద్యాదీవెన( Jagananna Vidya Deevena Scheme ) కిట్లు అందించడంతో పాటు 47 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక అందించిందని పేర్కొన్నారు.ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విద్యావిధానం అందుబాటులోకి తెచ్చామన్నారు.మన బడి - నాడు నేడులో 99.81 శాతం స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.అలాగే 77 గిరిజన మండలాల్లో వైఎస్ఆర్( YSR )సంపూర్ణ పోషణ పథకం అందుబాటులో ఉందని మంత్రి బుగ్గన వెల్లడించారు.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!
Advertisement

తాజా వార్తలు