పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ( People Media Factory ) ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు ఎక్కువగా వినిపించడంతో పాటు ఇప్పుడు ఇది ఒక బ్రాండ్ గా మారిపోయింది.ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న సినిమాలపై భారీగా క్రేజ్ నెలకొంది.
ఇప్పటికే రవితేజ నటించిన ధమాకా, పవన్ కళ్యాణ్ తో బ్రో, ప్రభాస్ తో ఆది పురుష్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక ప్రస్తుతం లైన్లో ప్రభాస్ తో రాజాసాబ్,( Rajasaab ) స్పిరిట్‌ను( Spirit ) కూడా తెలుగులో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
అలాగే చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా లైన్‌లో పెట్టాలని చూస్తున్నారు.
ఇంత బిజీలో ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాకర్టీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్( TG Vishwa Prasad ) ఇప్పుడు ఈగల్ ప్రమోషన్స్( Eagle Promotions ) కోసం స్వయంగా రంగంలోకి దిగడం అన్నది ఆశ్చర్య పోవాల్సిన విషయం.మామూలుగా టీజీ విశ్వప్రసాద్ కు ఇంత ఫ్రీగా మీడియా ముందు ప్రమోషన్స్ చేసే అంత సమయం కూడా ఉండదు.అలాంటిది ఇప్పుడు ఏకంగా ఈగల్ ప్రమోషన్స్ లో పాల్గొనడంతో పాటు ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తమ బ్యానర్‌లో ఇప్పుడు 15 సినిమాలు రెడీగా ఉన్నాయని, వాటన్నంటిని క్లియర్ చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే తాను రంగంలోకి దిగినట్టుగా తెలిపారు.సినిమాలు తీయడమే కాదు.
వాటిని రిలీజ్ కూడా చేయాలన్నట్టుగా ఫన్నీగా స్పందించారు విశ్వా ప్రసాద్.
అయితే ఆయన మాటలు ప్రకారం చూస్తే ఈ ఏడాదిలో వరుసగా నెలకు ఒక సినిమా ఉంటుందని తెలుస్తోంది.వ్యాపారాలతో పాటు ఈ సినిమాలను కూడా సమానంగా చూసుకుంటున్నామని చెప్పుకొచ్చారు విశ్వ ప్రసాద్.సాఫ్ట్ వేర్ కంపెనీతో పాటు, సినిమా నిర్మాణం, థియేటర్ బిజినెస్‌లోకి రావడం, స్టూడియో ప్లానింగ్స్, ఫిల్మ్ అకాడమీ ఏర్పాటు చేయడం వంటివి తమ భవిష్యత్తు కార్యకలాపణ అని చెప్పారు.
ఫిల్మ్ అకాడమీ( Film Academy ) పెట్టి తమకు కావాల్సిన టాలెంటెడ్ పర్సన్‌ను తామే తయారు చేసుకుని ఇండస్ట్రీకి అందించడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు.డిస్ట్రిబ్యూషన్ సైడ్ కొంత మంది వ్యక్తులతో కలిసి సాగుతున్నారట.
అలా సినిమాలు తీయడమే కాదు.ప్రతీ రంగంలోనూ తమ హస్తం ఉండేలా చేసుకుంటున్నారు టీజీ విశ్వ ప్రసాద్.