ఏపీ అసెంబ్లీలో మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగంను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్( Buggana Rajendranath ) ప్రారంభించారు.గత ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు.
మ్యానిఫెస్టోను సీఎం జగన్( CM Jagan ) పవిత్రగ్రంధంగా భావించారని తెలిపారు.బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అందిస్తుందని తెలిపారు.రూ.3,367 కోట్లతో విద్యాదీవెన( Jagananna Vidya Deevena Scheme ) కిట్లు అందించడంతో పాటు 47 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక అందించిందని పేర్కొన్నారు.ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విద్యావిధానం అందుబాటులోకి తెచ్చామన్నారు.మన బడి – నాడు నేడులో 99.81 శాతం స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.అలాగే 77 గిరిజన మండలాల్లో వైఎస్ఆర్( YSR )సంపూర్ణ పోషణ పథకం అందుబాటులో ఉందని మంత్రి బుగ్గన వెల్లడించారు.