మహేష్ బాబుతో సినిమా తర్వాత పూజా హెగ్డే పరిస్థితి ఏంటి అంటూ ఫ్యాన్స్ ఆందోళన

టాలీవుడ్ లో స్టార్ హీరోలకు జోడిగా వరుస సినిమాలు చేసిన పూజా హెగ్డే కెరియర్ గురించి ప్రస్తుతం ఆమె అభిమానంలో ఆందోళన వ్యక్తం అవుతుంది.ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో పూజా హెగ్డే నటిస్తోంది.

 The Future Of Mahesh Babu Heroine Pooja Hegde , Pooja Hegde, Mahesh Babu , Flim-TeluguStop.com

టాలీవుడ్ లో ఆమె చేస్తున్న ఏకైక చిత్రం అది ఒక్కటే.ఇప్పటి వరకు మరే కొత్త సినిమా కు ఆమె ఓకే చెప్పలేదు.

ఆమె వద్దకు ఆఫర్లు రావడం లేదు అనేది ప్రచారం జరుగుతుంది.మరో వైపు హిందీ లో కూడా ఒకే ఒక సినిమా చేస్తుంది.

అది కూడా సల్మాన్ ఖాన్ హీరో గా నటిస్తున్న సినిమా.సల్మాన్ ఖాన్ తో జంటగా నటిస్తున్న కూడా ఈ అమ్మడి ని బాలీవుడ్ లో పెద్దగా పట్టించుకోవడం లేదు.

Telugu Mahesh Babu, Pooja Hegde, Telugu, Trivikram-Movie

అక్కడ ఇక్కడ ఆఫర్లు రాక పోవడంతో పూజ హెగ్డే కెరియర్ గురించి అభిమానులు భయం వ్యక్తం చేస్తున్నారు.ఏ సమయం లో పరిస్థితులు ఎలా మారిపోతాయో అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.మహేష్ బాబు తో ప్రస్తుతం చేస్తున్న సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా పూజ హెగ్డే యొక్క కెరియర్ ఎలా ఉంటుందో అంటూ ఆమె ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.మహేష్ బాబు తో గతం లో నటించిన హీరోయిన్స్ కొందరు ఆశించిన స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకోలేక పోయారు.

మహేష్ బాబు సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆ సినిమా లో నటించిన హీరోయిన్ కి పెద్దగా స్కోప్ ఉండదు.కనుక పూజా హెగ్డే పరిస్థితి టాలీవుడ్ లో తర్వాత ఏంటి అంటే కష్టమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకి పూజా హెగ్డే సినీ కెరియర్ మహేష్ బాబు తో సినిమా తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలంటే మరికొన్ని వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube