హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) హాజరయ్యారు.స్టాఫ్ నర్సులకు( Staff Nurses ) ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు.
తెలంగాణ వ్యాప్తంగా సుమారు 6,956 మంది స్టాఫ్ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలు ఇవ్వడం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.
నిరుద్యోగుల కలలను సాకారం చేయడంలో ఇది మొదటి అడుగని చెప్పారు.ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.త్వరలోనే 15 వేల పై చిలుకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.టీఎస్పీఎస్సీ( TSPSC ) ద్వారా ఉద్యోగాల నియామకాలు చేపడతామని పేర్కొన్నారు.అప్పులు, ఆర్థిక భారం ఉన్నా ఉద్యోగాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.నిరుద్యోగుల కళ్లలో సంతోషం చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.