ఇప్పటికే నాలుగు విడతలుగా వైసిపి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ అధిష్టానం, మరో లిస్టును ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించి దానికి అనుగుణంగా నియోజకవర్గ ఇన్చార్జి లను జగన్ ( YS Jagan Mohan Reddy )మారుస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జనాల్లో వ్యతిరేకత ఉందని, అది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని సర్వేల్లో తేలడంతో భారీగా మార్పు, చేర్పులకు జగన్ శ్రీకారం చుట్టారు.ఇప్పటికే నాలుగు విడతలుగా విడుదల చేసిన జాబితాలో వైసీపీకి చెందిన సీనియర్ నేతలు, జగన్ కు అత్యంత సన్నిహితులు ఉన్నారు.
వారి విషయంలోనూ జగన్ మొహమాటంకు వెళ్లకుండా అభ్యర్థులను మార్చారు.నాలుగు విడతల్లో 58 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, పదిమంది వరకు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు.
ఇక మిగిలిన వారి ఎంపిక పైన దృష్టి పెట్టారు.ఇప్పటికే ఐదో జాబితాకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు.
ఆ జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు వైసీపీలోని కీలక నాయకుల ద్వారా తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ఐదో జాబితా విడుదలకు ముందుగానే వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు తాడేపల్లి నుంచి పిలుపు అందినట్లు సమాచారం.దీంతో పిలుపు అందిన వారు తాడేపల్లికి క్యూ కడుతున్నారు .జగన్ నుంచి పిలుపు అందుకున్న వారిలో టెన్షన్ నెలకొంది.తమకు మళ్లీ టిక్కెట్ ఇచ్చేందుకు తాడేపల్లి( Tadepalle )కి పిలుస్తున్నారా లేక, వేరొకరికి అవకాశం ఇస్తున్నామని.కలిసి పని చేయాలని చెప్పేందుకు జగన్ పిలిచారా అనేది టెన్షన్ కలిగిస్తోంది.
ఐదో జాబితాలో ఎన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేస్తారనేది తేలాల్సి ఉంది.భారీ స్థాయిలో మార్పు చేరుకులకు జగన్ శ్రీకారం చుట్టడంతో, టిక్కెట్ దక్కని వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు.
కొంతమంది ఇతర పార్టీల్లో చేరిపోగా, మరి కొంత మంది టికెట్ హామీ దొరికితే పార్టీ మారాలని చూస్తున్నారు.
ఈనెల 25 లోగా అభ్యర్థుల జాబితాను పూర్తిస్థాయిలో ప్రకటించి, ఎన్నికల ప్రచారానికి దిగాలనే ఆలోచనతో జగన్ ఉన్నారు.ఈ మేరకు ఈనెల 25 నుంచి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర( Uttarandhra ) జిల్లాలకు సంబంధించి వైసిపి నాయకులు, కార్యకర్తలతో భీమిలి లో భారీ సభను జగన్ ఏర్పాటు చేస్తున్నారు.
అయితే ఈ మార్పు, చేర్పుల ప్రభావం ఆ సభపై ఎంతవరకు ఉంటుందనే దానిపైన లెక్కలు వేసుకుంటున్నారు.