ఇండియాలో శరవేగంగా అమ్ముడవుతోన్న స్కూటర్లలో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, హీరో జూమ్, హీరో ప్లెజర్ ప్లస్, హోండా డియో అన్నింటికంటే ముందున్నాయి.హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ భారత్‌లోని అత్యధికంగా అమ్ముడైన 110సీసీ స్కూటర్లగా ప్రస్తుతం రికార్డ్ సాధించారు.
గేర్‌లెస్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో అతిపెద్ద వాటా ఈ స్కూటర్లదే కావడం ఇపుడు మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.ట్రాఫిక్‌లో కూడా అన్ని వయసుల స్త్రీ, పురుష వాహన చోదకులు సులభంగా నడపడానికి వీలుండడం వలన ప్రజలు వీటిపైన మక్కువ చూపుతున్నారు.

అంతేకాకుండా 110 సీసీ వాహనాలు అధిక మైలేజీని ఇవ్వడం కూడా అదనపు ప్రత్యేకత.ఈ క్రమంలో భారత్‌లో ఎక్కువగా అమ్ముడయ్యే టాప్ స్కూటర్ల వివరాలు తెలుసుకుందాం.ముందుగా ఇక్కడ “హోండా యాక్టివా( Honda Activa )” గురించి మాట్లాడుకోవాలి.ఇది భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్.దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.75,347 నుంచి రూ.81,378గా ఉంది.

తరువాత “హీరో ప్లెజర్ ప్లస్( Hero Pleasure Plus )” గురించి మాట్లాడుకోవాలి.మహిళా రైడర్‌లు ఎక్కువగా మెచ్చే విధంగా ఇది ప్రసిద్ధి చెందింది.దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.69,638 నుంచి రూ.78,538గా ఉంది.

ఆ తరువాత “టీవీఎస్ జూపిటర్”( TVS Jupiter ) గురించి ఇక్కడ చర్చించుకోవాలి.ఇది ప్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వస్తోంది.దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.72,190 నుంచి రూ.88,498గా ఉంది.అదేవిధంగా “హీరో జూమ్” కూడా జనాలు మెచ్చిన వాహనంగా ప్రసిద్ధి గాంచింది.కాగా దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.69,099 నుంచి రూ.77,199గా ఉంది.ఇక చివరగా “హోండా డియో” గురించి మాట్లాడుకోవాలి.‘డియో’ లుక్ పరంగా ఆకర్షణీయంగా ఉండడం వలన దీనిని ఎక్కువగా యువత కొనుక్కుంటున్నారు.దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.68,625 నుంచి రూ.72,626గా ఉంది.