తమిళనాడుకు చెందిన 87 ఏళ్ల రంగనాథన్ అనే రైతును ఇటీవల వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లిన సమయంలో పాము కరిచింది.
పాము కరిచిందని హాస్పిటల్‌కు వెళ్తే ఏ పాము కరిచింది అంటూ వైధ్యులు ప్రశ్నిస్తారు.
ఆ విషయం గతంలో ఒకసారి అనుభవం అయ్యింది.దాంతో రంగనాథ్‌న్ తనకు కరిచిన పామును వెదికి పట్టుకుని, దాన్ని హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాడు.
వైధ్యులకు ఆ పాము కరిచిందని చూపించి చికిత్స పొందాడు.
కడలూరులోని విరుదాచలంలో రంగనాథన్‌ను పాము కరిచింది.ఆ పాము విషం వల్ల రంగనాథన్‌కు ప్రమాదం పొంచి ఉంది.అయినా కూడా ధైర్య సాహసాలతో ఆ పామును పట్టుకుని వచ్చాడు.
రంగనాథన్ పామును తీసుకు రావడంతో ఆ పాము ఎలాంటిది అనేది చూసి వెంటనే చికిత్స ప్రారంభించారు.అయితే రంగనాథన్ తీసుకు వచ్చిన పామును చూసి వైధ్యులతో పాటు, సిబ్బంది కూడా హడావుడి చేశారు.
ఆ పాము ఎక్కడ జారి హాస్పిటల్‌లో పడి జనాలను కరుస్తుందో అని భయపడ్డారు.
రంగనాథన్ ధైర్యంగా పామును పట్టుకు రావడంతో అంతా కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు.దేశ వ్యాప్తంగా ఈ విషయం వైరల్ అయ్యింది.87 ఏళ్ల వృద్ద రైతు పాముతో రావడంతో స్థానికంగా అంతా కూడా అవాక్కవుతున్నారు.ఎలా ఈ రైతు ఆ పామును పట్టుకు వచ్చాడని అంటున్నారు.
పాము కుట్టింది అంటే సగం భయంతోనే చస్తారు.కాని రంగనాథన్ మాత్రం అనూహ్యంగా పామును తీసుకు రావడం వైరల్ అయ్యింది.
కుటుంబ సభ్యుల కంటే ముందు హాస్పిటల్‌కు వెళ్లడం అభినందనీయం.రంగనాథన్ కుటుంబ సభ్యులకు విషయం చెప్పి, ఆ తర్వాత హాస్పిటల్‌కు వెళ్తే మరింత ప్రమాదం జరిగేది.
కాని ఆయన మాత్రం నేరుగా హాస్పిటల్‌కు వెళ్లడంతో ఆయనకు పెద్ద ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy